కోర్టులతో ఘర్షణకు సిద్ధపడ్డ ఏపీ ప్రభుత్వం " రోజాను అడ్డుకునేందుకు పోలీసుల మోహరింపు

ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తనపై సస్పెన్షన్‌ను కోర్టు కొట్టివేయడంతో రోజా అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. కోర్టు ఆర్డర్ కాపీతో అసెంబ్లీకి వెళ్తానని ప్రకటించారు. అయితే కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రోజాను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకూడదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. రోజా అసెంబ్లీ ఆవరణలోకి రాకుండా అడ్డుకునేందుకు భారీగా పోలీసులను మోహరించారు. మహిళా మార్షల్స్‌ను అసెంబ్లీ గేటు వద్ద మోహరించారు. మరోవైపు రోజాకు స్వాగతం పలికేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. […]

Advertisement
Update: 2016-03-17 02:27 GMT

ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తనపై సస్పెన్షన్‌ను కోర్టు కొట్టివేయడంతో రోజా అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. కోర్టు ఆర్డర్ కాపీతో అసెంబ్లీకి వెళ్తానని ప్రకటించారు. అయితే కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రోజాను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకూడదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. రోజా అసెంబ్లీ ఆవరణలోకి రాకుండా అడ్డుకునేందుకు భారీగా పోలీసులను మోహరించారు. మహిళా మార్షల్స్‌ను అసెంబ్లీ గేటు వద్ద మోహరించారు. మరోవైపు రోజాకు స్వాగతం పలికేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. రోప్ పార్టీలను ఏర్పాటు చేశారు. రోజాను అడ్డుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైసీపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యంచేసుకునే అధికారం కోర్టులకు లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అసెంబ్లీ వ్యవహారాల్లో తప్పులు దొర్లినా వాటిపై కోర్టు జోక్యంచేసుకునేందుకు వీలు లేదని వాదిస్తోంది. 212 నిబంధన ఇదే చెబుతోందంటోంది. హైకోర్టు తీర్పుపై డివిజన్‌ బెంచ్‌లో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వపరంగా కాకుండా అసెంబ్లీ కార్యదర్శి ద్వారా కోర్టులో అప్పీల్ కు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై చంద్రబాబుతో యనమల ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. సింగిల్ బెంచ్‌ తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లేందుకు ప్రభుత్వానికి హక్కు ఉంది. కాకపోతే హైకోర్టు ప్రస్తుతం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దం కాకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. కోర్టులతో ఏపీ ప్రభుత్వం నేరుగానే ఢీకొనేందుకు సిద్ధమైనట్టుగా ఉంది. చూడాలి పరిణామాలు ఎలా మారుతాయో!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News