బాబు వీడియో ప్లే చేస్తా... లేకుంటే రాజీనామా చేస్తా...

రైతు రుణమాఫీ అంశంపై అసెంబ్లీలో వాడీవేడిగా వాదనలు సాగాయి. తాముఎన్నికల సమయంలో పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పామని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ చెప్పారు. దొంగ రుణాలు మాఫీ చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. దీనిపై ప్రతిపక్ష నేత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రుణమాఫీపై ప్రభుత్వానికి జగన్ సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, బ్యాంకుల్లో బంగారం బయటకు రావాలంటే బాబు రావాలంటూ […]

Advertisement
Update: 2016-03-16 01:59 GMT

రైతు రుణమాఫీ అంశంపై అసెంబ్లీలో వాడీవేడిగా వాదనలు సాగాయి. తాముఎన్నికల సమయంలో పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పామని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ చెప్పారు. దొంగ రుణాలు మాఫీ చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. దీనిపై ప్రతిపక్ష నేత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

రుణమాఫీపై ప్రభుత్వానికి జగన్ సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, బ్యాంకుల్లో బంగారం బయటకు రావాలంటే బాబు రావాలంటూ ప్రచారం చేశారన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటల వీడియో టేపులను ఇప్పుడే ప్రదర్శించేందుకు తాము సిద్దమన్నారు. ఒక వేళ చంద్రబాబు అలా అన్నట్టు నిరూపించకపోతే తాను రాజీనామా చేసేందుకు సిద్దమని జగన్ అన్నారు. ఒకవేళ వ్యవసాయరుణాలన్నీ మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పినట్టు రుజువైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని జగన్ సవాల్ విసిరారు.

జగన్‌ సవాల్‌పై ప్రభుత్వం నేరుగా స్పందించలేదు. జోక్యం చేసుకున్న వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు…రుణామాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదన్నారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, కేంద్రం ఏమాత్రం సహకరించకపోయినప్పటికీ రూ. 7,400కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. దేశంలోనే ఇదో చరిత్ర అని పుల్లారావు చెప్పారు. అనంతరం తనప్రసంగాన్ని కొనసాగించిన కూన రవి కుమార్ ఎప్పటిలాగే జగన్‌, వైఎస్‌లపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ ముందుకెళ్లారు. వైఎస్‌కు దివంగత నేత అని పిలవకూడదన్నారు. కేవలం ఎన్టీఆర్‌ లాంటివారిని మాత్రమే దివంగత నేత అని పిలవాలన్నారు. వైసీపీ నేతలు మూర్ఖులని రవికుమార్ వ్యాఖ్యానించారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News