అప్పుడు స్పీకర్‌కు వినసొంపుగా ఉంటుందా?- జగన్

తాను తొమ్మిదేళ్లు సీఎంగా చేశానని, పదేళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించానని అయినా సరే తనకు జగన్ సరైన గౌరవం ఇవ్వడం లేదన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత మీడియా వద్ద చిట్‌ చాట్‌లో స్పందించారు. తాను ముఖ్యమంత్రి గారు అని పిలిచినా చంద్రబాబుకు మాత్రం తప్పుగానే అనిపిస్తోందన్నారు. చంద్రబాబు ఒక మహారాజులాగా ఫీల్ అవుతున్నారని జగన్‌ ఎద్దేవా చేశారు. మనమేమైనా రాచరికంలో ఉన్నామా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబును సార్‌ అని పిలవాలేమో అని అన్నారు. మనం […]

Advertisement
Update: 2016-03-16 09:51 GMT

తాను తొమ్మిదేళ్లు సీఎంగా చేశానని, పదేళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించానని అయినా సరే తనకు జగన్ సరైన గౌరవం ఇవ్వడం లేదన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత మీడియా వద్ద చిట్‌ చాట్‌లో స్పందించారు. తాను ముఖ్యమంత్రి గారు అని పిలిచినా చంద్రబాబుకు మాత్రం తప్పుగానే అనిపిస్తోందన్నారు. చంద్రబాబు ఒక మహారాజులాగా ఫీల్ అవుతున్నారని జగన్‌ ఎద్దేవా చేశారు. మనమేమైనా రాచరికంలో ఉన్నామా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబును సార్‌ అని పిలవాలేమో అని అన్నారు.

మనం ప్రజాస్వామ్యం ఉన్నామన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించుకోవాలన్నారు. తమకు టీడీపీకి కేవలం 1.8 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందని… అధికారంలో ఉన్నంత మాత్రాన అంతా తమదే జరగాలనుకోవడం తప్పన్నారు. సీఎంతో సహా మంత్రులు, అధికార సభ్యులు తమకు ఇష్టానుసారం తిడుతున్నారని అప్పుడు మాత్రం స్పీకర్‌కు వినసొంపుగా ఉంటుందా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు బీద ఏడుపులు ఏడుస్తున్నారని తాను అన్న మాటల్లో తప్పేముందని జగన్ ప్రశ్నించారు. హైదరాబాద్‌ ఔటర్ రింగ్, ఎక్స్‌ప్రెస్‌ హైవేలు వైఎస్‌ హయాంలో నిర్మించారని… వాటిని కూడా తానే నిర్మించానని చంద్రబాబు చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందని జగన్ ఎద్దేవా చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News