అసెంబ్లీ చరిత్రలో కోడెలది ప్రత్యేక అధ్యాయం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటిదాకా ఎందరో స్పీకర్లు వచ్చారు పోయారు. వీరందరిలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తి స్పీకర్‌ కోడెల. ఏ పార్టీతరపున ఎన్నికైనా స్పీకర్‌ స్థానంలో కూర్చున్నాక పార్టీలకు అతీతంగా వ్యవహరించడం ఆనవాయితీ. హంస పాలను, నీళ్లను వేరుచేసినంత నీతిగా అందరు స్పీకర్లు వ్యవహరించకపోయినా ఎక్కువమంది వీలైనంత నిష్పక్షపాతంగా వ్యవహరించేవారు. ఒక న్యాయమూర్తిలాగా సమధర్మాన్ని పాటించేవాళ్లు. తమ పార్టీవైపు మొగ్గుచూపినా అది వేలెత్తిచూపేలా ఉండేది కాదు. ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ స్పీకర్‌గా కోడెల ప్రవర్తనను అన్యాయం అని […]

Advertisement
Update: 2016-03-15 03:49 GMT

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటిదాకా ఎందరో స్పీకర్లు వచ్చారు పోయారు. వీరందరిలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తి స్పీకర్‌ కోడెల.

ఏ పార్టీతరపున ఎన్నికైనా స్పీకర్‌ స్థానంలో కూర్చున్నాక పార్టీలకు అతీతంగా వ్యవహరించడం ఆనవాయితీ. హంస పాలను, నీళ్లను వేరుచేసినంత నీతిగా అందరు స్పీకర్లు వ్యవహరించకపోయినా ఎక్కువమంది వీలైనంత నిష్పక్షపాతంగా వ్యవహరించేవారు. ఒక న్యాయమూర్తిలాగా సమధర్మాన్ని పాటించేవాళ్లు. తమ పార్టీవైపు మొగ్గుచూపినా అది వేలెత్తిచూపేలా ఉండేది కాదు.

ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ స్పీకర్‌గా కోడెల ప్రవర్తనను అన్యాయం అని ఎత్తిచూపుతూ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ప్రధానంగా స్పీకర్‌ కోడెల ప్రవర్తనమీద వాళ్లు చేస్తున్న ఆరోపణలు ఇవి:

  • మంచి స్పీకర్ కు ఉండాల్సిన ఏ ఒక్క మంచి లక్షణమూ కోడెలకు లేదు.
  • అసెంబ్లీ వ్యవహారాలశాఖమంత్రి కొందరు ప్రతిపక్షపార్టీ సభ్యులను ఒకరోజుపాటు సస్పెండ్‌ చేయమని తీర్మానంచేస్తే స్పీకర్‌ కోడెల వాళ్లను రెండురోజులపాటు సస్పెండ్‌ చేయడం.
  • నిబంధనలకు విరుద్దంగా రోజాను సంవత్సరంపాటు సస్పెండ్‌ చేయడం, సస్పెండ్‌ చేస్తూ సభానిబంధనలు ఏవీ పాటించకపోవడం.
  • రోజామీద ఏ ఆరోపణలైతే వచ్చాయో అంతకన్నా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారపార్టీ సభ్యుల జోలికి వెళ్లకపోవడం.
  • ప్రతిపక్షనాయకుడు ఏమి మాట్లాడటానికి లేచినా ఒక్క నిమిషం ప్రసంగంకూడా పూర్తికాకముందే అధికార పక్షం సభ్యులకు మైకు ఇవ్వడం, వాళ్లు జగన్‌ను వ్యక్తిగతంగా నీచాతినీచంగా మాట్లాడడం, దానిని స్పీకర్‌ ఖండించకపోవడం.
  • అధికార పక్షం సభ్యులు ఎలాంటి ఆరోపణలు చేసినా దానికి సమాధానంచెప్పే అవకాశం ప్రతిపక్షనాయకుడికి ఇవ్వకపోవడం.
  • ముఖ్యమంత్రి, లేదా మంత్రుల ఆరోపణలకు ప్రతిపక్షనాయకుడు ఘాటైన సమాధానం చెబుతున్నాడు అని గ్రహించగానే మైక్‌ కట్‌ చేయడం.
  • దాదాపు రెండేళ్లనుంచి ప్రతిపక్షనాయకుడు మాట్లాడడానికి లేవగానే అవినీతిపరుడని, హంతకుడని, తదితర ఆరోపణలను రికార్డు వేసినట్లుగా పదేపదే అవే విమర్శలుచేస్తున్నా, కోర్టు పరిధిలో వున్న అంశాలను లేవనెత్తుతున్నా స్పీకర్‌ అభ్యంతరం చెప్పకపోవడం.
  • సమాధానం చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడు లేచినా మైక్‌ ఇవ్వకపోవడం, ఇచ్చినా వెంటవెంటనే మైక్‌ కట్‌ చేయడం, ప్రతిపక్ష సభ్యులకు మైకులు ఇచ్చి తిట్టించడం.
  • చంద్రబాబుమీద ఈగ వాలనివ్వకుండా ఎవ్వరు ఏ విమర్శలు చేయబోయినా అడ్డుపడడం.
  • అధికార పక్ష సభ్యులు సభామర్యాదలను పాటించకుండా, అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌ వాడుతున్నా అడ్డుచెప్పకపోవడం.
  • సభలో అధికార పక్షం ఎత్తుగడలకు సహకరించడం మొదలైన అంశాలవల్ల స్పీకర్‌మీద అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని వైఎస్‌ఆర్‌సీపీ శాసన సభ్యులు ప్రకటించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News