పత్తాలేకుండా పోయిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు?

వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్శించి పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ సదరు ఎమ్మెల్యేలను కాపాడేందుకు చాలా దూరమే వెళ్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవిశ్వాస తీర్మానంపై ముందుకెళ్లేందుకు సిద్ధమైంది. అవిశ్వాసంపై ఓటింగ్ జరిగితే వైసీపీ విప్ ఆధారంగా గోడ దూకిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయమన్న భావనతో తెలివిగా వారిని తప్పించినట్టు తెలుస్తోంది. అవిశ్వాసంపై చర్చ మొదలైన సమయంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సభలో లేకుండా పోయారు. టీడీపీ నేతలు ముందస్తు వ్యూహంలో భాగంగానే ఎనిమిది […]

Advertisement
Update: 2016-03-14 03:37 GMT

వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్శించి పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ సదరు ఎమ్మెల్యేలను కాపాడేందుకు చాలా దూరమే వెళ్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవిశ్వాస తీర్మానంపై ముందుకెళ్లేందుకు సిద్ధమైంది. అవిశ్వాసంపై ఓటింగ్ జరిగితే వైసీపీ విప్ ఆధారంగా గోడ దూకిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయమన్న భావనతో తెలివిగా వారిని తప్పించినట్టు తెలుస్తోంది. అవిశ్వాసంపై చర్చ మొదలైన సమయంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సభలో లేకుండా పోయారు. టీడీపీ నేతలు ముందస్తు వ్యూహంలో భాగంగానే ఎనిమిది మంది ఎమ్మెల్యేలను వ్యక్తిగత పనుల పేరుతో నియోజకవర్గాలకే పరిమితం చేశారని చెబుతున్నారు. వైసీపీ విప్‌కు కూడా అందకుండా వారు వెళ్లారని చెబుతున్నారు.

అవిశ్వాసంపై మోషన్ మూవ్‌ చేయడం, వెంటనే చర్చను చేపట్టడం వల్ల తమకు విప్‌ విషయం తెలియలేదని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు చెప్పుకునేందుకు ఒక అవకాశం కల్పించారన్న భావన వ్యక్తమవుతోంది. సభకు హాజరై ఓటింగ్‌లో పాల్గొంటే అటోఇటో నిలబడాల్సి ఉంటుంది. టీడీపీకి అనుకూలంగా ఓటేస్తే అటోమెటిక్‌గా అనర్హత వేటు పడుతుంది. ఒకవేళ వైసీపీ తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే ఫిరాయించిన తర్వాత కూడా ఓటు వేయించుకోలేకపోయారన్న అవమానం మిగులుతుంది. అందుకే ఇలా 8 మంది ఫిరాయింపుదారులు సభకు రాలేదని చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్ష నేత జగన్‌ కూడా సభలో ఎత్తిచూపారు. ఎనిమిది మంది ఎక్కడున్నారని జగన్ ప్రశ్నించారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కనీసం సభలో కూడా లేరు చూడండి అంటూ ఎద్దేవా చేశారు. వారిపై అనర్హత వేటు పడుకుండా ఉండేందుకు ఎన్ని ఎత్తులు వేస్తున్నారని జగన్ అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News