టీడీపీకి షాక్ ఇచ్చిన స్పీకర్

తెలంగాణ టీడీపీ అసెంబ్లీలో దాదాపు గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తోంది.  తాజాగా స్పీకర్ మధుసూదనాచారి టీటీడీపీకి గట్టి షాక్ ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  మొత్తం 12 మందిని టీఆర్‌ఎస్‌ సభ్యులుగా గుర్తించారు. ఇదివరకే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌ సభ్యులుగా గుర్తించాలని టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన  ఎర్రబెల్లి దయాకర్ రావు స్పీకర్‌కు లేఖ రాశారు. తాజాగా బుధవారం తమను కూడా టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలంటూ […]

Advertisement
Update: 2016-03-10 10:55 GMT

తెలంగాణ టీడీపీ అసెంబ్లీలో దాదాపు గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా స్పీకర్ మధుసూదనాచారి టీటీడీపీకి గట్టి షాక్ ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 12 మందిని టీఆర్‌ఎస్‌ సభ్యులుగా గుర్తించారు.

ఇదివరకే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌ సభ్యులుగా గుర్తించాలని టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు స్పీకర్‌కు లేఖ రాశారు. తాజాగా బుధవారం తమను కూడా టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలంటూ మాగంటి గోపినాథ్, అరెకపూడి గాంధీలు స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. వీరి విజ్ఞప్తికి వెంటనే స్పందించిన స్పీకర్‌ 12 మందిని టీఆర్ఎస్‌లో విలీనం చేసేశారు. వీరికి శుక్రవారం అసెంబ్లీలో స్థానాలు కల్పిస్తారు.

ఇక టీటీడీపీలో మిగిలింది రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్ కృష్ణయ్య మాత్రమే. ఆర్‌ కృష్ణయ్య పార్టీలో ఉంటున్నా ఆయన మాత్రం బీసీ సమస్యలపైనే దృష్టి పెట్టారు. దీంతో టీడీపీ తరపున అసెంబ్లీలో వాణి వినిపించాల్సింది రేవంత్, సండ్ర మాత్రమే. అయితే వారికి ఆ అవకాశాన్ని కూడా అధికారపక్షం కల్పిస్తుందా అన్నది కూడా ప్రశ్నార్థకమే.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News