తాను దొంగ కాబట్టి... పక్కింటి వారిని నమ్మనంటే ఎలా?

రాజధాని దురాక్రమణ బట్టబయలు కావడంతో అక్కడే ముందుచూపుతో భూములు కొన్న పెద్దలు ఉలిక్కిపడుతున్నారు. మురళీ మోహన్ కూడా ఆ జాబితాలో ఉన్నారు. దీనిపై స్పందించిన మురళీమోహన్‌  తన నిజాయితీ గురించి చెప్పుకున్నారు. అదే సమయంలో తీర్పులు చెప్పే న్యాయమూర్తులపై నిందలేశారు. ఇప్పుడు భూములు కొన్న ప్రాంతాన్ని 2014లో గుర్తించానని చెప్పారు. అప్పుడే అక్కడ భూములు కొనాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.  నిజాయితీగా బతికే తమలాంటి వారిపై తప్పుడు కథనాలు రాస్తారా అని మండిపడ్డారు. అంతవరకు బాగానే ఉంది.  కానీ […]

Advertisement
Update: 2016-03-04 00:44 GMT

రాజధాని దురాక్రమణ బట్టబయలు కావడంతో అక్కడే ముందుచూపుతో భూములు కొన్న పెద్దలు ఉలిక్కిపడుతున్నారు. మురళీ మోహన్ కూడా ఆ జాబితాలో ఉన్నారు. దీనిపై స్పందించిన మురళీమోహన్‌ తన నిజాయితీ గురించి చెప్పుకున్నారు. అదే సమయంలో తీర్పులు చెప్పే న్యాయమూర్తులపై నిందలేశారు.

ఇప్పుడు భూములు కొన్న ప్రాంతాన్ని 2014లో గుర్తించానని చెప్పారు. అప్పుడే అక్కడ భూములు కొనాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. నిజాయితీగా బతికే తమలాంటి వారిపై తప్పుడు కథనాలు రాస్తారా అని మండిపడ్డారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇంతలోనే హైదరాబాద్‌ ఔటర్ రింగ్‌ రోడ్డుకు వెళ్లిపోయారు. తన వ్యాపారాన్ని దెబ్బతీసేందుకు వైఎస్ ఔటర్ రింగ్ రోడ్డు రూట్‌ను మార్చేశారని ఆరోపించారు.

కోర్టుకు వెళ్లగా అక్కడ న్యాయమూర్తిని వైఎస్‌ బెదిరించి అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారని తీవ్ర ఆరోపణ చేశారు. అంటే న్యాయమూర్తి తప్పుడు తీర్పు చెప్పారని ఆయన ప్రత్యక్షంగానే చెప్పారు . అంతే కాదు పైగా తీర్పును కేవలం రెండు లైన్లలో రాశారంటూ ఆరోపణ చేశారు. కానీ ఔటర్‌ రింగ్ రోడ్డుపై తీర్పు 49 పేజీల్లో సుధీర్ఘంగా రాశారు నాటి న్యాయమూర్తి. ఈ తీర్పును సుప్రీంలో సవాల్ చేసినా జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. కానీ అవన్నీ లెక్కచేయకుండా కోర్టు విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలన్న ఆలోచన కూడా లేకుండా నేరుగా న్యాయమూర్తిపైనే ఆరోపణలు చేయడం ముమ్మాటికి కోర్టు ధిక్కారం కిందకే వస్తుందంటున్నారు.

తీర్పు అనుకూలంగా రాకుంటే న్యాయమూర్తులు లొంగిపోయారు, అవతలివారు బెదిరించారు అంటే ఎలా అని సీనయర్ న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. బహుష మురళీమోహన్‌కు వ్యవస్థలను మేనేజ్ చేసే అలవాటు ఉందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాను దొంగ అయినంత మాత్రాన మిగిలిన వారు కూడా దొంగలే అనుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

Click on image to read:


Tags:    
Advertisement

Similar News