నిప్పూ నోరు విప్పు.. కుందేళ్లు లేవిక్కడ!

అమరావతిలో జరిగిన భారీ భూకుంభకోణంపై ముఖ్యమంత్రి నోరు విప్పాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు.  ”నిప్పు నోరు విప్పు” అంటూ చంద్రబాబునుద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయిలో రాజధాని కడుతామని చెప్పి చివరకు భూకుంభకోణాలు చేశారని ఆరోపించారు.  బాలయ్య వియంకుడికి 490 ఎకరాలు  కట్టబెట్టింది నిజం కాదా, లింగమనేని ఎస్టేట్ అక్రమం కాదా అని రోజా ప్రశ్నించారు. నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు వీటిపై ఎందుకు విచారణకు సిద్ధపడడం లేదో చెప్పాలన్నారు.  సాక్షిలో కథనాలు రాగానే […]

Advertisement
Update: 2016-03-03 02:37 GMT

అమరావతిలో జరిగిన భారీ భూకుంభకోణంపై ముఖ్యమంత్రి నోరు విప్పాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ”నిప్పు నోరు విప్పు” అంటూ చంద్రబాబునుద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయిలో రాజధాని కడుతామని చెప్పి చివరకు భూకుంభకోణాలు చేశారని ఆరోపించారు. బాలయ్య వియంకుడికి 490 ఎకరాలు కట్టబెట్టింది నిజం కాదా, లింగమనేని ఎస్టేట్ అక్రమం కాదా అని రోజా ప్రశ్నించారు. నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు వీటిపై ఎందుకు విచారణకు సిద్ధపడడం లేదో చెప్పాలన్నారు. సాక్షిలో కథనాలు రాగానే రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్‌ను స్తంభింపచేయడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు వాచీ లేదంటున్నారని కానీ టీడీపీకి ఓటేసిన జనానికి గోచి కూడా లేకుండా పోయిందన్నారు. టీడీపీ నేతలు కొనుగోలు చేసిన భూముల ధరలు పెరగాలన్న ఉద్దేశంతోనే ఉద్యోగుల తరలింపు అంశాన్ని పదేపదే తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. రైతుల భూములను అగ్రిజోన్లుగా ప్రకటించి టీడీపీ నేతల భూములున్న ప్రాంతాన్ని మాత్రం కమర్షియల్ జోన్లుగా ప్రకటించడం కుట్రలో భాగమేనని ఆరోపించారు.

ప్రతిపక్షాలకు నీతులు చెప్పే పయ్యావుల కేశవ్… అంత ఖచ్చితంగా వెళ్లి కోర్ క్యాపిటల్ పక్కనే భూములు ఎలా కొన్నారని నిలదీశారు. చదువుకుంటున్న పయ్యావుల కేశవ్ కుమారుడు అంత విలువైన భూములను ఎలా కొన్నారో చెప్పాలన్నారు. ఎంపీ మురళీమోహన్‌ హైటెక్ సిటీ నుంచి అమరావతి వరకు చంద్రబాబు బినామీగా వ్యవహరిస్తున్నారని రోజా ఆరోపించారు. రాజధాని ఎక్కడ వస్తుందో మురళీమోహన్‌కు చంద్రబాబు ముందే చెప్పారని, ఆయన వెళ్లి అక్కడ భూములు కొనుగోలు చేశారన్నారు. మురళీమోహన్, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల, పయ్యావుల ఇలా టీడీపీ నేతలంతా 13 జిల్లాలను వదిలిపెట్టి నేరుగా కోర్ క్యాపిటల్ చుట్టూ ఎలా భూములు కొన్నారని ప్రశ్నించారు. సీఆర్‌డీఏ పరిధి అంత స్పష్టంగా ఎలా తెలిసిందని ప్రశ్నించారు. సాక్షితోపాటు వైసీపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తామన్న మంత్రుల మాటలను రోజా తిప్పికొట్టారు . కేసుల పేరుతో తాటాకు చప్పుళ్లు చేస్తే భయపడేందుకు ఇక్కడ కుందేళ్లు లేవని రోజా అన్నారు.

Click on image to read:

 


Tags:    
Advertisement

Similar News