రాజధాని దురాక్రమణపై తేల్చేసిన చంద్రబాబు

రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన  రాజధాని దురాక్రమణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. వేలాది ఎకరాలను టీడీపీ నేతలు కొనుగోలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు ఏం చెబుతారా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఆయన మాత్రం  ఎదురుదాడే చేశారు.  భూములు కొంటే తప్పేముంది. డబ్బులున్నాయి భూములు కొనుక్కున్నారు. భూముల వ్యాపారం చేయడం తప్పా! అని ఎదురు ప్రశ్నించారు. భూముల కొనుగోలుపై విచారణకు ఆదేశిస్తారా అని విలేకర్లు ప్రశ్నించగా చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు.  ఏం జరిగిందని విచారణ జరపాలని అని ప్రశ్నించారు. […]

Advertisement
Update: 2016-03-03 11:05 GMT

రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన రాజధాని దురాక్రమణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. వేలాది ఎకరాలను టీడీపీ నేతలు కొనుగోలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు ఏం చెబుతారా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఆయన మాత్రం ఎదురుదాడే చేశారు. భూములు కొంటే తప్పేముంది. డబ్బులున్నాయి భూములు కొనుక్కున్నారు. భూముల వ్యాపారం చేయడం తప్పా! అని ఎదురు ప్రశ్నించారు.

భూముల కొనుగోలుపై విచారణకు ఆదేశిస్తారా అని విలేకర్లు ప్రశ్నించగా చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు. ఏం జరిగిందని విచారణ జరపాలని అని ప్రశ్నించారు. విచారణ అవసరం లేదని తేల్చేశారు. ప్రైవేట్ వ్యక్తులు భూములు కొన్నారు దానితో మనకేం సంబంధం అని బాబు ప్రశ్నించారు. భూములు కొనుక్కున్న వారు 50 వేల ఎకరాలకు వెలుపలే కొనుక్కున్నారు కదా అని చంద్రబాబు అన్నారు. ఎవరో భూములు కొనుక్కుంటే దానితో తనకేం సంబంధం అని ముఖ్యమంత్రి అన్నారు. ఎవడో వచ్చి వారి పిల్లలతో కలిసి భూములు కొంటే దానికి తానేం చేయగలనని చంద్రబాబు ప్రశ్నించారు. మొత్తం మీద వేల ఎకరాల భూకుంభకోణంపై విచారణ జరిపించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చంద్రబాబు నేరుగానే తేల్చిచెప్పారు.

Click on image to read:


Tags:    
Advertisement

Similar News