పోలవరం పూర్తయ్యే సరికి గోదావరి ఉంటుందా?

రైల్వే బడ్జెట్లోనే కాదు సాధారణ బడ్జెట్‌లోనూ ఏపీకి కేంద్రం మొండి చేయి చూపింది.  ప్రత్యేక హోదా ఊసే లేదు.  లోటు బడ్జెడ్ మాటే లేదు.  ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే ఆలోచన కేంద్రానికి ఉన్నట్టు కనిపించడం లేదు. బడ్జెట్‌లో కేవలం వంద కోట్లు  మాత్రమే . దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.  ఈ లెక్కన ఏడాదికి వంద కోట్లు కేటాయిస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేసరికి అసలు గోదావరి ప్రవాహం ఉంటుందా?.  ఎందుకంటే.. అంచనాలు పెంచిన తర్వాత […]

Advertisement
Update: 2016-02-29 05:55 GMT

రైల్వే బడ్జెట్లోనే కాదు సాధారణ బడ్జెట్‌లోనూ ఏపీకి కేంద్రం మొండి చేయి చూపింది. ప్రత్యేక హోదా ఊసే లేదు. లోటు బడ్జెడ్ మాటే లేదు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే ఆలోచన కేంద్రానికి ఉన్నట్టు కనిపించడం లేదు. బడ్జెట్‌లో కేవలం వంద కోట్లు మాత్రమే . దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ లెక్కన ఏడాదికి వంద కోట్లు కేటాయిస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేసరికి అసలు గోదావరి ప్రవాహం ఉంటుందా?. ఎందుకంటే..

అంచనాలు పెంచిన తర్వాత పోలవరం నిర్మాణ వ్యయం 36 వేల కోట్లకు చేరింది. ఏడాదికి వంద కోట్లు ఇస్తే ఈ అంచనా వ్యయంతో పోలవరం పూర్తి కావాలన్నా 360 ఏళ్లు పడుతుంది. ఒక నివేదిక ప్రకారం మరో వందేళ్లకు నదీ ప్రవాహాలు పూర్తిగా తగ్గుతాయని చెబుతున్నారు. ఆ లెక్కన చూస్తే పోలవరం పూర్తయ్యే వరకు గోదావరి ప్రవాహం ఉంటుందా? . రాష్ట్ర ప్రభుత్వమేమో 2018 నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతామని పదేపదే చెబుతోంది. మంత్రి ఉమా ఎప్పుడూ ప్రెస్‌ మీట్ పెట్టినా 2018కి పోలవరం పూర్తి చేస్తాం రాసిపెట్టుకోండి అని చెబుతున్నారు. కానీ జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరానికి కేంద్రం మాత్రం ఇలా ఏటా వందల కోట్లతో సరిపెడుతోంది.

ఎక్కడ వంద కోట్లు.. ఎక్కడ 36 వేల కోట్ల అంచనా వ్యయం. ఇలా అయితే పోలవరం పూర్తవడం కలే. పోలవరం నిర్వాసితులు కూడా ఏమాత్రం టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. పోలవరాన్ని నేతలు ఇంకో వందేళ్లు ఎన్నికల హామీగా వాడుకోవచ్చు. పోలవరానికే కాదు… ఇతర కేటాయింపుల్లో ఏపీకి మొండి చేయే మిగిలింది. విజయవాడ మెట్రోకు వంద కోట్లు, ట్రిపుల్ ఐటీలకు రూ. 20 కోట్లు, తిరుపతి ఐఐటీకి రూ. 40 కోట్లు, విశాఖ ఐఐఎంకు రూ. 30 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. ఇక టీడీపీ కేంద్రంలో భాగస్వామి అయి ఇక ఉపయోగం ఏముంది.?.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News