జేసీ.. వాట్ ఈజ్ దిస్?

జేసీ దివాకర్‌ రెడ్డి. ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తారు.  ఒకసారి జగన్ మా వాడే అంటారు. దాంతో వైసీపీ ఫ్యాన్స్ కూడా జేసీ మీద కాసింత ఇష్టం పెంచుకుంటారు. బాబు తీరు మారాల్సిందే అని పెద్ద మనిషిలా సూచనలు ఇస్తారు. తాను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతానని చెబుతారు. ప్రస్తుత పరిస్థితులు, రాజకీయలు చూస్తుంటే ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యవస్థ వేస్ట్ అని నేరుగా ప్రధానిని, సీఎంను ఎన్నుకుంటే సరిపోతుందని ఆవేదన చెంది అందరినీ ఆలోచింపచేస్తారు. అలా చేయడం ద్వారా జేసీ దివాకర్ […]

Advertisement
Update: 2016-02-29 07:13 GMT

జేసీ దివాకర్‌ రెడ్డి. ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తారు. ఒకసారి జగన్ మా వాడే అంటారు. దాంతో వైసీపీ ఫ్యాన్స్ కూడా జేసీ మీద కాసింత ఇష్టం పెంచుకుంటారు. బాబు తీరు మారాల్సిందే అని పెద్ద మనిషిలా సూచనలు ఇస్తారు. తాను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతానని చెబుతారు. ప్రస్తుత పరిస్థితులు, రాజకీయలు చూస్తుంటే ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యవస్థ వేస్ట్ అని నేరుగా ప్రధానిని, సీఎంను ఎన్నుకుంటే సరిపోతుందని ఆవేదన చెంది అందరినీ ఆలోచింపచేస్తారు. అలా చేయడం ద్వారా జేసీ దివాకర్ రెడ్డి స్వచ్చమైన రాజకీయాలు కోరుకుంటున్నారన్న భావన కలిగిస్తారు. అయితే ఒక్కోసారి ఇందుకు పూర్తి భిన్నంగా మాట్లాడి అందరికీ షాక్‌ ఇస్తుంటారు జేసీ.

మన దేశంలో రాజకీయ వ్యవస్థ తీరు మారాలని గతంలో చెప్పిన జేసీ… ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తాను కూడా సాధారణ రాజకీయనాయకుడినే అన్నట్టు మాట్లాడారు. ఎమ్మెల్యేల పిరాయింపులను ఏమాత్రం ఖండించకపోగా… వాటిని సమర్ధించేలా, గోడ దూకే ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పేలా మాట్లాడారు . ఆ మధ్య జగన్ పత్రిక సాక్షి రాజ్యసభ ఓటింగ్‌పై ఒక కథనం ప్రచురించింది.

రాజ్యసభ ఎన్నికల్లో ఓపెన్ బ్యాలెట్ ఉంటుందని ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు తప్పకపోవచ్చని కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన జేసీ . ‘’మేమంతా తిక్కలోళ్లమా! రాజ్యసభకు ఓపెన్ బ్యాలెట్టా!. ఎమ్మెల్యేల గురించి ఏమనుకుంటున్నారు. అందరూ తెలివి తక్కువోళ్లమనుకుంటున్నారా’’ అని జేసీ ప్రశ్నించారు. ‘’ఓపెన్ బ్యాలెట్ ఉండదు… సీక్రెట్ బ్యాలెట్లే రాజ్యసభ ఎన్నికల్లో ఉంటుంది’’ అని చెప్పి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ధైర్యం నూరిపోశారు. ధైర్యంగా గోడ దూకేసేయండి… మీ పదవులకు వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదని తన అనుభవాన్ని రంగరించి ధైర్యం చెప్పారు జేసీ. టీడీపీలో చేరే వైసీపీ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇవ్వరని జగన్ ప్రచారం చేయించడం కూడా సరికాదని జేసీ చెప్పారు. అంటే కండువా మార్చినా భవిష్యత్తుపై భయపడాల్సిన పనిలేదని జేసీ పరోక్షంగా చెప్పి ఫిరాయింపులను సమర్థించారు. పైగా తమ ప్రభుత్వ పాలనలో వివక్షను ధైర్యంగా మీడియా ముందే చెప్పారు.

తాను అధికార పార్టీ వాడిని కావడంతో తన నియోజకవర్గంలో అన్ని పనులు జరిగిపోతున్నాయని.. దీన్ని చూసి పక్క నియోజకవర్గానికి చెందిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గిలగిలలాడిపోతున్నారని అందుకే అధికార పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. జేసీ చెప్పింది నిజమే . కానీ అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ది జరుగుతుందని, ప్రతిపక్షాలను గెలిపిస్తే అభివృద్ధి ఆగిపోతుందని చెప్పడం మాత్రం జేసీ లాంటి పెద్దమనుషులకు సరికాదేమో. పొగిడితే గానీ బాబు పాలనలో పనులవ్వవని జేసీ కూడా గుర్తించినట్టున్నారు. చంద్రబాబును భలే పొగిడేస్తున్నారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News