వర్మ వెనుక ఉన్నది ఎవరు? రాధా వర్గం ఆగ్రహం ఎందుకు?

వర్మ వివాదాస్పద డైరెక్టరే కాదు… మానిపోయిన గాయాలను మళ్లీ  గుర్తు చేసే డైరెక్టర్‌ కూడా. ఆ మధ్య రక్త చరిత్ర సినిమా తీసి ఎప్పుడో అనంతపురంలో జరిగి పోయిన ఘటనలు మళ్లీ గుర్తు చేసి లేనిపోని సమస్యలు సృష్టించారు. వాస్తవ ఘటనల ఆధారంగా అంటూ వివాదాస్పద అంశాలను తెరపైకి తెస్తుంటారు. ఇప్పుడు విజయవాడపై పడ్డాడు వర్మ. వంగవీటి రంగా  జీవితం, ఆయన హత్య తదితర అంశాలపై సినిమా తీస్తానని బయలు దేరారు. సినిమా తీయడం వరకు బాగానే ఉంది. […]

Advertisement
Update: 2016-02-27 00:09 GMT

వర్మ వివాదాస్పద డైరెక్టరే కాదు… మానిపోయిన గాయాలను మళ్లీ గుర్తు చేసే డైరెక్టర్‌ కూడా. ఆ మధ్య రక్త చరిత్ర సినిమా తీసి ఎప్పుడో అనంతపురంలో జరిగి పోయిన ఘటనలు మళ్లీ గుర్తు చేసి లేనిపోని సమస్యలు సృష్టించారు. వాస్తవ ఘటనల ఆధారంగా అంటూ వివాదాస్పద అంశాలను తెరపైకి తెస్తుంటారు. ఇప్పుడు విజయవాడపై పడ్డాడు వర్మ. వంగవీటి రంగా జీవితం, ఆయన హత్య తదితర అంశాలపై సినిమా తీస్తానని బయలు దేరారు. సినిమా తీయడం వరకు బాగానే ఉంది. కానీ వర్మ తీరే ఒక బాధ్యత గల పౌరుడి తరహాలో లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా తీసుకునే వాడు సినిమాకు పరిమితం కాకుండా ”తానూ రౌడీనే” అంటూ ట్విటర్ ద్వారా సవాళ్లు విసరడమే వివాదాస్పదమవుతోంది. పరోక్షంగా వంగవీటి రాధా వర్గీయులను రెచ్చగొట్టడమే పనిగా వర్మ పెట్టుకున్నారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తాను ఒకప్పుడు రంగా దగ్గరకు వెళ్లినప్పుడు పిల్లాడైన రాధా బ్యాక్ గ్రౌండ్‌లో ఆడుకుంటూ ఉండడం చూశానంటూ ఆ మధ్య ఒక ట్వీట్ పెట్టారు వర్మ. “వీడు ఎంత పెరిగినా ఇంకా పిల్లోడిలా బిహేవ్ చేస్తున్నాడు” అంటూ రంగా తనతో అన్నారని ట్వీట్ చేశారు. రంగా గురించి ఒక్క శాతం అర్థమై ఉంటే రాధా కూడా రంగాలాగా చేతల మనిషి అయ్యేవాడని వ్యాఖ్యానించారు. “నేను నా సినిమా తేడాగా తీస్తే రంగా గారి ఫ్యాన్స్ ఊరుకోరని వార్నింగ్ ఇచ్చిన రాధాకి ఇది నా కౌంటర్ వార్నింగ్, ముందు ప్లాష్ బ్యాక్ అర్థం చేసుకో” అంటూ వర్మ తీవ్ర కామెంట్ చేశారు. ఇప్పుడు ఏకంగా తాను విజయవాడ వస్తున్నా అడ్డుకునే దమ్మున్న రౌడీలు రావచ్చంటూ సవాల్ చేసి అక్కడ తిరుగుతున్నారు. అయితే వర్మ ఈ స్థాయిలో రెచ్చిపోవడం వెనుక వంగవీటి రంగా వ్యతిరేకులున్నారని రాధా వర్గం అనుమానం. సినిమాకు నిధులు కూడా సదరు వర్గమే సమకూరుస్తోందని ఆరోపిస్తున్నారు. వర్మ విజయవాడకు వస్తే అదేదో పెద్ద రాజకీయ నాయకుడికి స్వాగతం పలికిన తరహాలో ఘన స్వాగతం లభించడం కూడా వంగవీటి వర్గీయులకు మింగుడుపడడం లేదు. తమ వ్యతిరేకులే ఈ స్వాగత ఏర్పాట్లు చేశారని అనుమానిస్తున్నారు.

దేవినేని వర్గంతో పాటు రంగా వర్గీయులను కూడా కలిసి జరిగిన ఘటనలను గురించి తెలుసుకుంటానని వర్మ చెప్పినా రంగా భార్య గానీ, రాధాగాని అందుకు సుముఖంగా లేరు. ఇందుకు కారణం వర్మ తెరకెక్కిస్తున్న వంగవీటి చిత్రం… తమకు వ్యతిరేకంగా తీయబోతున్నారన్నది వారి భావన అని తెలుస్తోంది. కొందరు వ్యక్తులు వర్మ వెనుక ఉండి దీనిపై కథ నడుపుతున్నారని వంగవీటి రాధా వర్గీయుల ఆరోపణ.

వర్మకు సహకరించేందుకు దేవినేని వర్గీయులు ఆసక్తి చూపుతుండడాన్ని కూడా రాధా వర్గీయులు గుర్తు చేస్తున్నారు. వర్మ నేరుగా దేవినేని నెహ్రు ఇంటికి వెళ్లి చర్చలు జరపారు కూడా. రాధా పట్ల ఇటీవల వర్మ పెడుతున్న ట్వీట్లను పరిశీలించిన వారు కూడా ఆయన తీరు రాధాకు వ్యతిరేకంగా ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే వర్మ ఇలా సినిమా పేరుతో మానిపోయిన గాయాలను మళ్లీ రేపుతూ లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారని విజయవాడవాసులు మండిపడుతున్నారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News