బాలయ్యా... స్పీచ్ సూపరయ్య!

లేపాక్షి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బాలకృష్ణ దగ్గరుండి ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా బాలకృష్ణ ప్రసంగించారు.  అనేక అంశాలపై మాట్లాడారు. ఆధ్యాత్మికత నుంచి ఆహారం వరకు అన్ని అంశాలను టచ్ చేశారు. ఆత్మల పుట్టుక గురించి కూడా వివరించారు.  కొన్ని ఆత్మలు పూర్వజన్మలోని పాప పుణ్యాలను అనుభవించేందుకు పుడుతాయన్నారు. మరికొన్ని ఆత్మలు ఇతర ఆత్మల చేత కర్మఫలం అనుభవించేలా చేయడానికి పుడుతాయన్నారు. అలాంటి ఆత్మలకు చావుపుట్టుకలతో సంబంధం ఉండదన్నారు. చావన్న భయం కూడా ఆ ఆత్మకు […]

Advertisement
Update: 2016-02-27 03:49 GMT

లేపాక్షి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బాలకృష్ణ దగ్గరుండి ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా బాలకృష్ణ ప్రసంగించారు. అనేక అంశాలపై మాట్లాడారు. ఆధ్యాత్మికత నుంచి ఆహారం వరకు అన్ని అంశాలను టచ్ చేశారు. ఆత్మల పుట్టుక గురించి కూడా వివరించారు. కొన్ని ఆత్మలు పూర్వజన్మలోని పాప పుణ్యాలను అనుభవించేందుకు పుడుతాయన్నారు. మరికొన్ని ఆత్మలు ఇతర ఆత్మల చేత కర్మఫలం అనుభవించేలా చేయడానికి పుడుతాయన్నారు. అలాంటి ఆత్మలకు చావుపుట్టుకలతో సంబంధం ఉండదన్నారు. చావన్న భయం కూడా ఆ ఆత్మకు ఉండదన్నారు. అలాంటి మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు. చాలా మంది మహనీయుడు, మహానుభావుడు అని కీర్తిస్తుంటారని.. సన్మానాలు చేస్తుంటారని… కానీ మహనీయుడంటే ఒక్క ఎన్టీఆర్ మాత్రమేనన్నారు బాలయ్య.

దేశంలో ఏదో ఒక క్షేత్రంలో ఉత్సవాలు జరుగుతూ ఉండాలన్నారు. విశాఖకు హుద్‌ హుద్ వచ్చినప్పుడు ఫెస్టివల్ నిర్వహించడం జరిగిందని ఆసక్తికరంగా మాట్లాడారు. ఒంటిమిట్టలోనూ ఏటా శ్రీరామనవమి నిర్వహిస్తున్నామన్నారు. దైవ రుణం ఎప్పుడూ ఉంచుకోకూడదన్నారు. దైవ రుణం తీర్చుకోవడంలో భాగంగానే యజ్ఞయాగాలు చేయాలన్నారు. యాగాలు చేస్తే పంచభూతాలు, అష్టదిక్కులు ప్రసన్నమవుతాయని అన్నారు. ఆ విషయం తనకు తెలుసని … ఆ అనుభవం కూడా తనకుందన్నారు. ముందు జన్మలో పది మంది తెలిసి ఉంటే వారిలో ఈ జన్మకు ఒకరిద్దరు మాత్రమే మిగులుతారని … తనకు మాత్రం ఎంతో మంది అభిమానులున్నారన్నారు. కళలకు మన దేశం ఒక పీఠంలాంటిదన్నారు. ఇక్కడ ధర్మం మట్టిలో ఇమిడి ఉందని… కూరుకుపోయిందని ఆయన అన్నారు.

టెక్నాలజీ మన దేశంలో పూర్వకాలంలోనే ఉందన్నారు. రావణుడి పుష్పక విమానం గాల్లోనే తేలుతుందని.. నేలకు మూడు అంగుళాలపైనే నిలబడేదన్నారు. అంటే అప్పట్లోనే విమానం ఉండేదన్న మాట అని అన్నారు. మొత్తం మీద బాలయ్య తన ప్రసంగంలో చాలా విషయాలను కవర్ చేశారు.

Click on image to read:

 

 

 

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News