జగన్‌పై ఇప్పుడు మరో కొత్త ప్రచారం !

ఒక పార్టీలో గెలిచినవారిని గోడ దాటించి మరో పార్టీలో చేర్చుకోవడాన్ని ప్రజాస్వామ్యంలో ఎవరూ హర్షించరు.  అలా పార్టీ మారిన వారితో రాజీనామా కూడా చేయించబోమని చెప్పడం రాజకీయ పతనంలో అదో బెంచ్ మార్కే అవుతుంది. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని తీవ్ర విమర్శల పాలవుతున్న టీడీపీ … తప్పు మాది కాదు జగన్‌దే అని నమ్మించేందుకు చాలా ఎత్తులు వేస్తోంది.  ఎమ్మెల్యేలను అలా చేర్చుకోవడం తప్పు కదా అంటే…  ”జగన్ ప్రభుత్వాన్ని పడగొడుతానని రెచ్చగొట్టాడు.. అందుకే […]

Advertisement
Update: 2016-02-25 22:13 GMT

ఒక పార్టీలో గెలిచినవారిని గోడ దాటించి మరో పార్టీలో చేర్చుకోవడాన్ని ప్రజాస్వామ్యంలో ఎవరూ హర్షించరు. అలా పార్టీ మారిన వారితో రాజీనామా కూడా చేయించబోమని చెప్పడం రాజకీయ పతనంలో అదో బెంచ్ మార్కే అవుతుంది. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని తీవ్ర విమర్శల పాలవుతున్న టీడీపీ … తప్పు మాది కాదు జగన్‌దే అని నమ్మించేందుకు చాలా ఎత్తులు వేస్తోంది. ఎమ్మెల్యేలను అలా చేర్చుకోవడం తప్పు కదా అంటే… ”జగన్ ప్రభుత్వాన్ని పడగొడుతానని రెచ్చగొట్టాడు.. అందుకే తాము వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం” అని ఎదురుదాడి చేశారు.

జగన్‌ అలా అనడం తప్పుకానప్పుడు తాము ఎమ్మెల్యేలను చేర్చుకుంటే అన్యాయం ఎలా అవుతుంది అని వాదించారు. అయితే గవర్నర్‌ను కలిసిన తర్వాత జగన్ మాట్లాడిన టేపును మరోసారి ప్లే చేసి చూసే సరికి జగన్ ఏమన్నారన్నది జనానికి తెలిసిపోయింది. ప్రభుత్వాన్ని పడగొట్టేంత బలం తనకు లేదని 21 మంది ఎమ్మెల్యేలు వస్తే ప్రభుత్వం గంటలో పడిపోతుందని జగన్ చెప్పారు. దాన్ని వక్రీకరించి నవ్వులపాలైన టీడీపీ నేతలు ఇప్పుడు పరోక్షంగా మరో కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అందుకు నందమూరి హరికృష్ణను వాడుకుంటున్నారు.

వైసీపీకి దక్కే ఒక రాజ్యసభ స్థానాన్ని విజయసాయిరెడ్డికి ఇవ్వాలని జగన్ చాలా కాలం క్రితమే నిర్ణయించుకున్నారు. అయితే రాజ్యసభ సీటును హరికృష్ణకు ఇచ్చే ప్రయత్నంలో జగన్‌ ఉన్నారని అలా చేయడం ద్వారా ఎన్టీఆర్ కుటుంబంలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అనుకూల మీడియా ద్వారా ప్రచారం మొదలుపెట్టారు. ఎన్టీఆర్‌ కుటుంబంలో చీలిక రాకుండా అడ్డుకునేందుకే చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారన్నది టీడీపీ నేతల కొత్త వాదన. ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా రాజ్యసభ సీటు కూడా వైసీపీకి దక్కకుండా చేయాలన్నది టీడీపీ ఎత్తుగడ ఆలోచనట. అంటే చూసే వారికి ఎన్టీఆర్‌ ఫ్యామిలీలో చీలిక తెచ్చేందుకు జగన్‌ ప్రయత్నించడం సరైనది కాదు కదా.. దాన్ని అడ్డుకోవడం కోసం చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టడం సరైనదే అన్న అభిప్రాయం కలిగేలా చేయడం దీని వెనుక ఎత్తుగడగా చెబుతున్నారు.

పార్టీ ఫిరాయింపులు అనే ఒక అపవిత్ర చర్యకు పవిత్రత తెచ్చేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. అయినా వైసీపీకి రాజ్యసభ స్థానం దక్కకుండా చేసేంత స్థాయిలో ఎమ్మెల్యేలను కొనడం అన్నది దాదాపు అసాధ్యమని చెబుతున్నారు. అమ్ముడుపోయేందుకు ఐదారుగురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటారే గానీ అందరూ అలాగే ఉండరని వైసీపీ నేతల ధీమా. అమ్ముడుపోయే సరుకు ఇప్పటికే అమ్ముడుపోయిందంటున్నారు. వైసీపీకి రాజ్యసభ సీటు దక్కాలంటే 36 మంది ఎమ్మెల్యేలుంటే చాలు…

Click on image to read:

 

Tags:    
Advertisement

Similar News