ఈ రెడ్డి ఏ రెడ్డికి ఎర్త్ పెడతారు?

భూమానాగిరెడ్డి టీడీపీలోకి రావడం కర్నూలు జిల్లాకు చెందిన శిల్పా బద్రర్స్‌కే ఇబ్బంది అని భావించారు. అయితే ఇప్పుడు టీడీపీలోని సీనియర్‌ నేతలకు భయం పట్టుకుంది.  ఒక విధమైన అసంతృప్తి వారిలో కనిపిస్తోంది.  భూమానాగిరెడ్డికి చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారన్న  విషయం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.  ఇప్పటికే మంత్రి పదవి ఆశిస్తూ రెండేళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సీనియర్ తమ్ముళ్లు మధ్యలో ఈ వైసీపీ వలస నేతల గోలేందని మండిపడుతున్నారు. ముఖ్యంగా భూమాకు […]

Advertisement
Update: 2016-02-26 02:32 GMT

భూమానాగిరెడ్డి టీడీపీలోకి రావడం కర్నూలు జిల్లాకు చెందిన శిల్పా బద్రర్స్‌కే ఇబ్బంది అని భావించారు. అయితే ఇప్పుడు టీడీపీలోని సీనియర్‌ నేతలకు భయం పట్టుకుంది. ఒక విధమైన అసంతృప్తి వారిలో కనిపిస్తోంది. భూమానాగిరెడ్డికి చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారన్న విషయం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే మంత్రి పదవి ఆశిస్తూ రెండేళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సీనియర్ తమ్ముళ్లు మధ్యలో ఈ వైసీపీ వలస నేతల గోలేందని మండిపడుతున్నారు.

ముఖ్యంగా భూమాకు మంత్రి పదవి ఇస్తే తమకు ఎక్కడ ఎర్త్ పడుతుందోనని రెడ్డి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏపీ కేబినెట్‌లో రెడ్డి సామాజికవర్గం నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాథరెడ్డి ప్రాతనిధ్యం వహిస్తున్నారు. కేబినెట్ విస్తరణ జరిగితే తనకు మంత్రి పదవి గ్యారెంటీ అన్న ఆశలో సోమిరెడ్డి కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు భూమా పేరు తెరపైకి రావడంతో సోమిరెడ్డికీ భయంపట్టుకుంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు రెడ్డి మంత్రులున్నారు. భూమాను తీసుకుంటే ఆ సంఖ్య మూడుకు చేరుతుంది. సోమిరెడ్డిని కూడా తీసుకుంటే నలుగురవుతారు. కానీ ఆ అవకాశం లేదు.

ఎందుకంటే నిబంధనల ప్రకారం మొత్తం ఎమ్మెల్యేలలో 15 శాతం మందికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 20 మందితో కేబినెట్ నడుస్తోంది. అంటే మరో ఆరుగురికి మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి రెడ్డి సామాజికవర్గం నుంచి నలుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశమే లేదు. ఇప్పటికే చంద్రబాబు సొంత సామాజికవర్గం నుంచి సీఎంతో కలిపి ఆరుగురు కమ్మ మినిస్టర్లు ఉన్నారు. దాని వల్లే చంద్రబాబు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఇప్పుడు నలుగురు రెడ్లకు మంత్రి పదవి అంటే టీడీపీలో అది దాదాపు అసాధ్యం. ఆ మాటకు వస్తే ముగ్గురు రెడ్లకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం కూడా టీడీపీలో లేదంటున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో భూమాకు మంత్రి పదవి ఇస్తే సోమిరెడ్డి, బొజ్జల, పల్లె ముగ్గురిలో ఒకరి ప్రయోజనాలకు గండిపడినట్టేనని భావిస్తున్నారు. ఇంకొందరు మాత్రం అసలు భూమాకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు కదా ఈ సమస్య వచ్చేది అని నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. చూడాలి భూమా ఇతర రెడ్లకు ఎర్త్ పెడుతారో… లేక భూమానే బాధితుడిగా మారుతారో !

Click on image to read:

Tags:    
Advertisement

Similar News