పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన చిరు

ఈ మధ్య నాయకులు పదేపదే శీలపరీక్ష ఎదుర్కొంటున్నారు.  ఫ‌లాన నేత గోడ దూకేస్తున్నార‌ని క‌థ‌నాలు రాయ‌డం కామ‌నైపోయింది. ఈ జాబితాలో ఇటీవ‌ల నటుడు, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి కూడా చేరారు. చిరంజీవి పార్టీ మారుతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. చిరంజీవి వైసీపీ, బీజేపీ వైపు చూస్తున్నార‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. రెండు రోజుల క్రితం చిరు త‌న సొంతూరు మోగ‌ల్తూరులో ప‌ర్య‌టించారు. ఆ స‌మ‌యంలో చిరు ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను వైసీపీ నేత కొత్త‌ప‌ల్లి సుబ్బ‌రాయుడు ప‌ర్య‌వేక్షించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌మ‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా […]

Advertisement
Update: 2016-02-23 23:11 GMT

ఈ మధ్య నాయకులు పదేపదే శీలపరీక్ష ఎదుర్కొంటున్నారు. ఫ‌లాన నేత గోడ దూకేస్తున్నార‌ని క‌థ‌నాలు రాయ‌డం కామ‌నైపోయింది. ఈ జాబితాలో ఇటీవ‌ల నటుడు, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి కూడా చేరారు. చిరంజీవి పార్టీ మారుతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. చిరంజీవి వైసీపీ, బీజేపీ వైపు చూస్తున్నార‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి.

రెండు రోజుల క్రితం చిరు త‌న సొంతూరు మోగ‌ల్తూరులో ప‌ర్య‌టించారు. ఆ స‌మ‌యంలో చిరు ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను వైసీపీ నేత కొత్త‌ప‌ల్లి సుబ్బ‌రాయుడు ప‌ర్య‌వేక్షించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌మ‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా చిరు వ‌చ్చారంటూ ప‌ర్య‌ట‌నకు ఆరోజు కాంగ్రెస్ శ్రేణులు కూడా దూరంగా ఉన్నాయి. వైసీపీ నేత సుబ్బారాయుడు … చిరు ప‌ర్య‌ట‌న ఏర్పాట్లు చేయ‌డంతో మెగాస్టార్ పార్టీ మార్పుపై ఊహాగానాలు మ‌రింత ఊపందుకున్నాయి. ఈ నేప‌థ్యంలో బుధవారం హైద‌రాబాద్ ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఒక కార్య‌క్ర‌మానికి హాజ‌రైన చిరంజీవి తాను పార్టీ మార‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. తాను బీజేపీలో చేరుతున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వ‌మ‌న్నారు. రాజ‌కీయాల్లో ఉన్నంత‌ వ‌ర‌కూ కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతాన‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ మార్పులపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని చెప్పారు. అలాంటి కథనాలు రాయవద్దని కోరారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News