చిరంజీవిపై అవమానకర స్థాయిలో విరుచుకుపడ్డ బాలయ్య
లేపాక్షి ఉత్సవాల్లో శ్రీకృష్ణదేవరాయుని గెటప్‌లో కనిపిస్తానని ఇటీవల బాలకృష్ణ ప్రకటించారు. కానీ చూస్తుంటే బాలకృష్ణ స్వయంగా తానో కృష్ణదేవరాయలనుకుంటున్నట్టుగా ఉంది. తన సొంత సామ్రాజ్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బాలకృష్ణ స్వయంగా చేసిన వ్యాఖ్యలే ఆయన మైండ్ సెట్‌కు అద్దం పడుతున్నాయి. లేపాక్షి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న బాలయ్య .. కార్యక్రమానికి చిరంజీవిని పిలువలేదని ప్రకటించారు. అంతటితో ఆగలేదు. ఎవరిని పిలవాలో తనకు తెలుసన్నారు. తాను ఎవరిని నెత్తిన ఎక్కించుకోనని, తన నెత్తిమీద ఎక్కేవారిని పిలవాల్సిన అవసరం […]
లేపాక్షి ఉత్సవాల్లో శ్రీకృష్ణదేవరాయుని గెటప్‌లో కనిపిస్తానని ఇటీవల బాలకృష్ణ ప్రకటించారు. కానీ చూస్తుంటే బాలకృష్ణ స్వయంగా తానో కృష్ణదేవరాయలనుకుంటున్నట్టుగా ఉంది. తన సొంత సామ్రాజ్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బాలకృష్ణ స్వయంగా చేసిన వ్యాఖ్యలే ఆయన మైండ్ సెట్‌కు అద్దం పడుతున్నాయి.
లేపాక్షి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న బాలయ్య .. కార్యక్రమానికి చిరంజీవిని పిలువలేదని ప్రకటించారు. అంతటితో ఆగలేదు. ఎవరిని పిలవాలో తనకు తెలుసన్నారు. తాను ఎవరిని నెత్తిన ఎక్కించుకోనని, తన నెత్తిమీద ఎక్కేవారిని పిలవాల్సిన అవసరం లేదన్నారు. సెలబ్రిటీలే కావాలనుకుంటే తన పక్కన చాలా మంది ఉన్నారు..వారినే పిలుచుకుంటానని చిరంజీవిని పిలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాను డిక్టేటర్‌నని ఆ పద్దతిలోనే ముందుకెళ్తానన్నారు. “ఇండస్ట్రీ నుంచి ఇద్దర్ని తప్ప మరెవర్నీ నేను పిలవలేదు. నేను ఎవరినీ నెత్తిన ఎక్కించుకుని కూర్చోబెట్టుకోను. పిలిస్తే రకరకాల మనుషులు వస్తారు. నేను నా పద్ధతిలో… ‘డిక్టేటర్’ పద్ధతిలో వెళ్తాను. వేదిక మీద నా పక్కన నిలబడితే చాలా మందికి గ్లామర్ వస్తుంది” అని హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ వ్యాఖ్యానించారు. బాలయ్య వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కూడా అవాక్కయ్యారు.
మొన్నటి ఎన్నికల్లో కాపులంతా టీడీపీకి ఓటు వేయడం వల్లే టీడీపీ విజయం సాధించిందని చెబుతున్నారు. చిరు సోదరుడు పవన్ కల్యాణ్ స్వయంగా టీడీపీ తరపున ప్రచారం చేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ ఇంత అవమానకరంగా వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు. బాలయ్య వ్యాఖ్యలతో చిరుతో పాటు పవన్ కల్యాణ్ అభిమానులు కూడా ఫీల్ అవడం ఖాయమంటున్నారు. అసలు బాలయ్య తీరు చూస్తుంటే పవన్‌ను కూడా పక్కన పెట్టేసినట్టుగానే అనిపిస్తోంది. బాలయ్య వ్యాఖ్యలపై మెగాఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏదీ ఏమైనా లేపాక్షి తన సొంత సామ్రాజ్యమన్నట్టుగా బాలయ్య వ్యవహరించడంపై ఇతర నేతలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. లేపాక్షి ఉత్సవాలను సొంత వైభవం చాటుకునేందుకు బాలయ్య వాడుకోవడం సరికాదని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కూడా విమర్శించారు .
Click on image to read: