ఢిల్లీ వెళ్లిన జ‌గ‌న్- అటు నుంచి న‌రుక్కొస్తారా!

వైసీపీ అధ్యకుడు జగన్ మోహన్ రెడ్డి ఉదయం ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల‌ను క‌ల‌వ‌నున్నారు. ప్ర‌త్యేక‌హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు త‌దితర అంశాల‌పై ఢిల్లీ పెద్ద‌ల‌తో జ‌గ‌న్ చ‌ర్చిస్తార‌ని చెబుతున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌రిణామాల‌ను కూడా ఆయ‌న రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధానిల‌కు వివ‌రించే అవ‌కాశం ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ వ‌ల వేస్తున్న నేప‌థ్యంలో ఆ విష‌యాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లే అవ‌కాశం ఉందంటున్నారు. ఫిరాయింపు […]

Advertisement
Update: 2016-02-22 01:15 GMT

వైసీపీ అధ్యకుడు జగన్ మోహన్ రెడ్డి ఉదయం ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల‌ను క‌ల‌వ‌నున్నారు. ప్ర‌త్యేక‌హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు త‌దితర అంశాల‌పై ఢిల్లీ పెద్ద‌ల‌తో జ‌గ‌న్ చ‌ర్చిస్తార‌ని చెబుతున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌రిణామాల‌ను కూడా ఆయ‌న రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధానిల‌కు వివ‌రించే అవ‌కాశం ఉంది.

వైసీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ వ‌ల వేస్తున్న నేప‌థ్యంలో ఆ విష‌యాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లే అవ‌కాశం ఉందంటున్నారు. ఫిరాయింపు రాజ‌కీయాల‌ను ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లిన ప‌క్షంలో మోదీ ఎలా స్పందిస్తారన్న‌ది ఆస‌క్తిక‌ర‌మే. తెలంగాణ‌లో ఫిరాయింపుల విష‌యంలో జోక్యం చేసుకోని ఢిల్లీ పెద్ద‌లు ఏపీ రాజ‌కీయాల్లో ఎంత‌వ‌ర‌కు జోక్యం చేసుకుంటారన్నది ప్రశ్న.

Click on image to read:

 

Tags:    
Advertisement

Similar News