ప‌దేళ్లు వెంటాడారు... మా కుటుంబాన్ని చంపారు.. ఇప్పుడైనా ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వ‌రా!

టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పైకి అంతా సాఫీగా సాగుతున్న‌ట్టు క‌నిపిస్తున్నా పాత నేత‌లు మాత్రం లోలోన ర‌గిలిపోతున్నారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డిని పార్టీలోకి చేర్చుకునే విష‌యంపై టీడీపీ నేత రామ‌సుబ్బారెడ్డి, దివంగ‌త నేత శివారెడ్డి స‌తీమ‌ణి ల‌క్ష్మీపార్వ‌త‌మ్మ తీవ్రంగా స్పందించారు. విజ‌య‌వాడ‌లో చంద్ర‌బాబును క‌లిసేందుకు వ‌చ్చిన వారు మీడియాతో మాట్లాడారు. ప‌దేళ్ల‌పాటు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను వెంటాడి వేధించిన ఆదినారాయ‌ణ రెడ్డి ఈరోజు ఇలా టీడీపీలోకి వ‌చ్చే ఆలోచ‌న చేస్తార‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌ని రామ‌సుబ్బారెడ్డి అన్నారు. […]

Advertisement
Update: 2016-02-22 08:30 GMT

టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పైకి అంతా సాఫీగా సాగుతున్న‌ట్టు క‌నిపిస్తున్నా పాత నేత‌లు మాత్రం లోలోన ర‌గిలిపోతున్నారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డిని పార్టీలోకి చేర్చుకునే విష‌యంపై టీడీపీ నేత రామ‌సుబ్బారెడ్డి, దివంగ‌త నేత శివారెడ్డి స‌తీమ‌ణి ల‌క్ష్మీపార్వ‌త‌మ్మ తీవ్రంగా స్పందించారు. విజ‌య‌వాడ‌లో చంద్ర‌బాబును క‌లిసేందుకు వ‌చ్చిన వారు మీడియాతో మాట్లాడారు. ప‌దేళ్ల‌పాటు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను వెంటాడి వేధించిన ఆదినారాయ‌ణ రెడ్డి ఈరోజు ఇలా టీడీపీలోకి వ‌చ్చే ఆలోచ‌న చేస్తార‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌ని రామ‌సుబ్బారెడ్డి అన్నారు.

త‌న పెద‌నాన్న‌, సోదరుడిని చంపేశార‌ని… అలాంటి వారితో క‌లిసి ప‌నిచేయ‌డం క‌ష్ట‌మేన‌న్నారు. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబుకు కూడా చెప్పామ‌న్నారు. ప‌దేళ్ల కాలంలో కార్య‌క‌ర్త‌ల‌ను వేంటాడి వేధించార‌ని, ఆర్థికంగా రాజ‌కీయంగా ఎంతో న‌ష్ట పోయామ‌న్నారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చింద‌ని ఆనందిస్తున్న స‌మ‌యంలో క‌నీసం ఈ మూడేళ్ల కాల‌మైనా ప్ర‌శాంతంగా త‌మ‌ను ఉండ‌నివ్వ‌కుండా చేస్తున్నార‌ని రామసుబ్బారెడ్డి ఆవేద‌న చెందారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పార్టీ కార్య‌క‌ర్త‌లు అనుభ‌వించిన న‌రకం ఇప్ప‌టికీ క‌ళ్ల ముందు క‌ద‌లాడుతోంద‌న్నారు. ఆదినారాయ‌ణ రెడ్డి చేరిక త‌ర్వాత అంతా స‌వ్యంగా ఉంటుంద‌ని తాను భావించ‌డం లేద‌న్నారు. భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో ఎదురుచూడాల‌న్నారు. ఇప్ప‌టికీ ఆదినారాయ‌ణ‌రెడ్డి రాక‌ను వ్య‌తిరేకిస్తున్నామ‌ని అయితే చంద్ర‌బాబుపై ఉన్న గౌర‌వంతో మౌనంగా ఉంటున్నామ‌న్నారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. చంద్రబాబు తనకు అన్నివిధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారన్నారు రామసుబ్బారెడ్డి.

ఎవ‌రి వ‌ల్ల అయితే త‌న భ‌ర్తను, కుమారుడిని కోల్పోయానో వారితో క‌లిసి ప‌నిచేయ‌డం క‌ష్ట‌మేన‌ని ల‌క్ష్మీదేవ‌మ్మ అన్నారు. చంద్ర‌బాబు త‌మ‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చినా, కార్పొరేష‌న్ ప‌ద‌వి ఇచ్చినా అక్క‌ర్లేద‌ని ఆమె అన్నారు. ఇక అంతా మీ ఇష్ట‌మ‌ని చంద్ర‌బాబుకే చెబుతామన్నారు. టీడీపీలోనే కొనసాగుతామన్నారు.

Click on image to read:

 

Tags:    
Advertisement

Similar News