అంతా చెబుతా- భూమా హైడ్రామా

భూమా ఎపిసోడ్ జీడిపాకంలా సాగుతూనే ఉంది.  ఉంటారో పోతారో నేరుగా చెప్పకుండా దాగుడుమూతలాట ఆడుతున్నారు. సోమవారం ఉదయం పీఏసీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన భూమా త్వరలోనే తన నిర్ణయం వెల్లడిస్తానన్నారు. అందుకు గంటలు పట్టవచ్చు… రోజులు పట్టవచ్చన్నారు. సమయమొచ్చినప్పుడు అంతా చెబుతానన్నారు. అయితే భూమానాగిరెడ్డి పీఏసీ పదవికి రాజీనామా చేశారని టీవీ చానళ్లలో పెద్దెత్తున ప్రచారం సాగింది.కానీ పదవికి రాజీనామా చేయలేదని భూమా అనంతరం చెప్పారు.  అయితే రాజీనామా లేఖను ఆయన స్పీకర్ […]

Advertisement
Update: 2016-02-22 02:39 GMT

భూమా ఎపిసోడ్ జీడిపాకంలా సాగుతూనే ఉంది. ఉంటారో పోతారో నేరుగా చెప్పకుండా దాగుడుమూతలాట ఆడుతున్నారు. సోమవారం ఉదయం పీఏసీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన భూమా త్వరలోనే తన నిర్ణయం వెల్లడిస్తానన్నారు. అందుకు గంటలు పట్టవచ్చు… రోజులు పట్టవచ్చన్నారు. సమయమొచ్చినప్పుడు అంతా చెబుతానన్నారు.

అయితే భూమానాగిరెడ్డి పీఏసీ పదవికి రాజీనామా చేశారని టీవీ చానళ్లలో పెద్దెత్తున ప్రచారం సాగింది.కానీ పదవికి రాజీనామా చేయలేదని భూమా అనంతరం చెప్పారు. అయితే రాజీనామా లేఖను ఆయన స్పీకర్ కు పంపినట్టు తెలుస్తోంది.

భూమా టీడీపీలో చేరిపోవడం దాదాపు ఖాయమైందనే చెబుతున్నారు. వైసీపీ కూడా ఇక భూమా విషయాన్ని లైట్ తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అటు కర్నూలు జిల్లాకు చెందిన శిల్పా బ్రదర్స్ ను చంద్రబాబు విజయవాడకు పిలిపించుకున్నారు. ఆదినారాయణ రెడ్డి సోమవారం సాయంత్రం విజయవాడలో చంద్రబాబును కలవనున్నారు. అదే సమయానికి విజయవాడ రావాల్సిందిగా రామసుబ్బారెడ్డికి సమాచారం అందించారని తెలుస్తోంది.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News