హోటల్‌ కోసమే ఈ దారుణం- జగన్

కృష్ణా జిల్లా రామవరప్పాడులో ఇన్నర్ రోడ్డు కోసం పేదల ఇళ్లు కూల్చేందుకు ప్రభుత్వం సిద్ధపడడంపై వివాదం ముదురుతోంది. బాధితులకు మద్దతు తెలిపి ఆందోళనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు.  తాజాగా ప్రతిపక్ష నేత జగన్ కూడా రామవరప్పాడులో ఆందోళన చేస్తున్న బాధితులను కలిశారు. వారిని సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. ఫ్లైఓవర్‌ పేరుతో వందలాది మందిని రోడ్డున పడేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఫ్లైఓవర్‌ నిర్మాణానికి టీడీపీ కార్పొరేటర్‌కు […]

Advertisement
Update: 2016-02-15 01:07 GMT

కృష్ణా జిల్లా రామవరప్పాడులో ఇన్నర్ రోడ్డు కోసం పేదల ఇళ్లు కూల్చేందుకు ప్రభుత్వం సిద్ధపడడంపై వివాదం ముదురుతోంది. బాధితులకు మద్దతు తెలిపి ఆందోళనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. తాజాగా ప్రతిపక్ష నేత జగన్ కూడా రామవరప్పాడులో ఆందోళన చేస్తున్న బాధితులను కలిశారు. వారిని సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.

ఫ్లైఓవర్‌ పేరుతో వందలాది మందిని రోడ్డున పడేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఫ్లైఓవర్‌ నిర్మాణానికి టీడీపీ కార్పొరేటర్‌కు చెందిన హోటల్‌ అడ్డంగా ఉందని దాన్ని తొలగించడం ఇష్టం లేని టీడీపీ నేతలు అలైన్‌మెంట్లు మార్చి పేదల ఇళ్లపై పడ్డారని మండిపడ్డారు. టీడీపీ కార్పొరేటర్‌కు చెందిన ఆ ఒక్క హోటల్‌ను తొలగిస్తే ఫ్లైఓవర్‌ కోసం వందలాది ఇళ్లు కూల్చాల్సిన పని ఉండదన్నారు. కానీ అలా చేయకుండా ఇప్పటికే 120 ఇళ్లు కూల్చేశారని… మరో 500 ఇళ్లు కూల్చేందుకు సిద్ధపడడం దారుణమన్నారు.

50, 60 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్న వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా రోడ్డున పడేస్తే వారెక్కడికి వెళ్లాలని జగన్ ప్రశ్నించారు. పేదల కడుపు కొట్టడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. చంద్రబాబు నిత్యం ఇదే దారిలో వెళ్తారని… ఆయన వెళ్లే సమయంలో రోడ్డు పక్కన ఇళ్లు గానీ, గుడిసెలు కానీ కనిపించకూడదంటూ ఆదేశాలు జారీ చేశారని జగన్ చెప్పారు. బాధితుల పక్షాన వైసీపీ పోరాడుతుందని జగన్ చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News