ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ సెట్ అయింది

ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్లు కనుక నిజమైతే…. త్వరలోనే ఎన్టీఆర్-రాజమౌళి కలిసి సినిమా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం జనతా గ్యారేజీ సినిమాతో ఎన్టీఆర్…. బాహుబలి-2 సినిమాతో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత వీళ్ల కాంబినేషన్ సెట్స్ పైకి వస్తుంది. వీళ్ల కాంబో సినిమా మరేదో కాదు… ఎన్నాళ్ల నుంచో రాజమౌళి ఊహల్లో కదలాడుతున్న గరుడ అనే ప్రాజెక్టే. అవును… దీనికి సంబంధించి విజయేంద్రప్రసాద్ ఇప్పటికే కథ కూడా పూర్తిచేశాడు. బాహుబలి […]

Advertisement
Update: 2016-02-13 01:31 GMT
ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్లు కనుక నిజమైతే…. త్వరలోనే ఎన్టీఆర్-రాజమౌళి కలిసి సినిమా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం జనతా గ్యారేజీ సినిమాతో ఎన్టీఆర్…. బాహుబలి-2 సినిమాతో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత వీళ్ల కాంబినేషన్ సెట్స్ పైకి వస్తుంది. వీళ్ల కాంబో సినిమా మరేదో కాదు… ఎన్నాళ్ల నుంచో రాజమౌళి ఊహల్లో కదలాడుతున్న గరుడ అనే ప్రాజెక్టే. అవును… దీనికి సంబంధించి విజయేంద్రప్రసాద్ ఇప్పటికే కథ కూడా పూర్తిచేశాడు. బాహుబలి సినిమాను దాదాపు మూడేళ్లు టైమ్ తీసుకున్న రాజమౌళి…. ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమాకు కూడా దాదాపు మూడేళ్లు సమయం తీసుకుంటాడని తెలుస్తోంది. అంటే… జనతా గ్యారేజీ తర్వాత మూడేళ్ల పాటు తెరపై తారక్ కనిపించడన్నమాట. ప్రస్తుతం టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో ఊపుమీదున్న తారక్… అంత గ్యాప్ తీసుకుంటాడా అనేది అందరి మదినీ తొలిచేస్తున్న ప్రశ్న. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజమౌళి కోసం మూడేళ్లు త్యాగం చేయడానికే సిద్ధపడుతున్నట్టు కనిపిస్తోంది.

 

Click on Image for Rakul Preet Singh Stills

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News