నాడు బాబుపెట్టిన చిచ్చు... నేడు వీరి మధ్య భగ్గుమంది

టీడీపీ నేతలమధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి పత్తిపాటి పుల్లారావుపై టీడీపీనేత డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తీవ్రవ్యాఖ్యలు చేశారు. అవగాహనలేకుండా మాట్లాడవద్దంటూ హితవు పలికారు. ప్రభుత్వానికి ఎస్‌.సి వర్గీకరణ చేసే ఆలోచన లేదని మంత్రి పుల్లారావు చెప్పడంపై డొక్కా ఫైర్‌ అయ్యారు. మంత్రి ఇష్టంవచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని సూచించారు. ఎస్‌.సి వర్గీకరణపై అవగాహన లేకుండా మాట్లాడవద్దన్నారు. అసంబద్ద వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. పుల్లారావ్‌ తన శాఖపై దృష్టిపెడితే చాలన్నారు. మాదిగలకు మందకృష్ణ మాదిగే నాయకుడని ఈ విషయంలో పుల్లారావ్‌ సర్టిఫికేట్‌ […]

Advertisement
Update: 2016-02-13 04:38 GMT

టీడీపీ నేతలమధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి పత్తిపాటి పుల్లారావుపై టీడీపీనేత డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తీవ్రవ్యాఖ్యలు చేశారు. అవగాహనలేకుండా మాట్లాడవద్దంటూ హితవు పలికారు. ప్రభుత్వానికి ఎస్‌.సి వర్గీకరణ చేసే ఆలోచన లేదని మంత్రి పుల్లారావు చెప్పడంపై డొక్కా ఫైర్‌ అయ్యారు. మంత్రి ఇష్టంవచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని సూచించారు. ఎస్‌.సి వర్గీకరణపై అవగాహన లేకుండా మాట్లాడవద్దన్నారు. అసంబద్ద వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు.

పుల్లారావ్‌ తన శాఖపై దృష్టిపెడితే చాలన్నారు. మాదిగలకు మందకృష్ణ మాదిగే నాయకుడని ఈ విషయంలో పుల్లారావ్‌ సర్టిఫికేట్‌ అవసరంలేదన్నారు. ఆదివారం మందకృష్ణ మాదిగ, ఇతర నాయకులతో సమావేశమయి మంత్రి పుల్లారావ్ వ్యాఖ్యలతోపాటు, భవిష్యత్తు కార్యాచరణ పై చర్చిస్తామని డొక్కా వెల్లడించారు.

ఎస్‌.సి వర్గీకరణ చేసే ఆలోచనలేదని పుల్లారావ్‌చెప్పడం కలకలమే రేపింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వర్గీకరణ చిచ్చుపెట్టిందే చంద్రబాబు అని చాలామంది చెబుతుంటారు. దళితులు కాంగ్రెస్‌ ఓట్‌ బ్యాంక్‌. వర్గీకరణ పేరుతో మాల, మాదిగల మధ్య విభేదాలు సృష్టించి ఒకవర్గాన్ని తనవైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నంచేసిన చంద్రబాబు ‘మాదిగల్లో పెద్ద మాదిగను’ నేను అవుతానంటూ ఎన్నికల్లో దళితుల ఓట్లు పొందిన చంద్రబాబు ఇప్పుడు వర్గీకరణ లేదంటే మాదిగలు మండిపడతారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వానికి వర్గీకరణ ఆలోచన లేదనడం కొత్త వివాదానికి తావిస్తుంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News