లాస్ట్ మినిట్ వరకు బాబుతో ఆడుకున్న ఎమ్మెల్యే

గురువారం రాత్రి టీఆర్‌ఎస్‌లో చేరిన నారాయణపేట టీటీడీపీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌ రెడ్డి వ్యవహరించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక విధంగా చంద్రబాబుతోనే ఆయన గేమ్ ఆడారు. ఎర్రబెల్లి టీడీపీని వీడిన తర్వాత గురువారం టీటీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగింది. సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి కూడా వచ్చారు. కాసేపు చంద్రబాబు పక్కనే కూర్చుని ముచ్చట్లు పెట్టాడు. సభలో రాజేందర్ రెడ్డి మాట్లాడారు. సంక్షోభ సమయంలో పార్టీకి అందరూ […]

Advertisement
Update: 2016-02-12 00:11 GMT

గురువారం రాత్రి టీఆర్‌ఎస్‌లో చేరిన నారాయణపేట టీటీడీపీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌ రెడ్డి వ్యవహరించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక విధంగా చంద్రబాబుతోనే ఆయన గేమ్ ఆడారు. ఎర్రబెల్లి టీడీపీని వీడిన తర్వాత గురువారం టీటీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగింది. సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి కూడా వచ్చారు. కాసేపు చంద్రబాబు పక్కనే కూర్చుని ముచ్చట్లు పెట్టాడు. సభలో రాజేందర్ రెడ్డి మాట్లాడారు. సంక్షోభ సమయంలో పార్టీకి అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇంకా చాలా మాట్లాడారు. ఆ మాటలు విన్న వారు రాజేందర్ రెడ్డి టీడీపీతోనే ఉండడం ఖాయమనుకున్నారు.

అయితే ఆఖరిలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో రాజేందర్‌ రెడ్డి మెల్లగా జారుకున్నారు. అక్కడి నుంచి నేరుగా హోటల్ తాజ్ కృష్ణ వద్ద ప్రత్యక్షమయ్యారు. అప్పటికే అక్కడ కేటీఆర్, హరీష్‌ రావు ఉన్నారు. వారితో చర్చలు జరిపిన రాజేందర్ రెడ్డి టీఆర్‌ఎస్‌లోచేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో టీటీడీపీ అధిష్టానంతో పాటు అందరూ కంగుతిన్నారు. చివరి నిమిషం వరకు చంద్రబాబుతో ఉండడమే కాకుండా విస్తృత స్థాయిసమావేశంలో ప్రసగించి ఆ వెంటనే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు రాజేందర్ రెడ్డి ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. ”ఎంత ధైర్యం చంద్రబాబుతోనే ఆటలాడుతారా” అని కొందరు నేతలు రుసరుసలాడారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News