సంక్షోభ సమయం- ఎర్రబెల్లిపై విరుచుకుపడ్డ రేవంత్

టీటీడీఎల్పీ నేతగా ఉన్న ఎర్రబెల్లి పార్టీ వీడడంతో పార్టీ శ్రేణులు షాక్ అయ్యాయి. కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగారు. కేసీఆర్‌, ఎర్రబెల్లిపై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌, ఎర్రబెల్లి రహస్య మిత్రులని ఆ విషయం ఇప్పుడు తేటతెల్లమైందన్నారు. ఒకరిద్దరు నేతలు పార్టీ వీడినా వచ్చిన నష్టమేమీ లేదన్నారు. తెలంగాణలో కుల సమీకరణాలు మారుతున్నాయని పరోక్షంగా కేసీఆర్, ఎర్రబెల్లి ఒకే సామాజికవర్గం వారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఫిరాయింపుల ద్వారా కేసీఆర్‌ పైశాచిక […]

Advertisement
Update: 2016-02-10 11:02 GMT

టీటీడీఎల్పీ నేతగా ఉన్న ఎర్రబెల్లి పార్టీ వీడడంతో పార్టీ శ్రేణులు షాక్ అయ్యాయి. కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగారు. కేసీఆర్‌, ఎర్రబెల్లిపై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌, ఎర్రబెల్లి రహస్య మిత్రులని ఆ విషయం ఇప్పుడు తేటతెల్లమైందన్నారు. ఒకరిద్దరు నేతలు పార్టీ వీడినా వచ్చిన నష్టమేమీ లేదన్నారు. తెలంగాణలో కుల సమీకరణాలు మారుతున్నాయని పరోక్షంగా కేసీఆర్, ఎర్రబెల్లి ఒకే సామాజికవర్గం వారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఫిరాయింపుల ద్వారా కేసీఆర్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారని రేవంత్ మండిపడ్డారు. త్వరలోనే హరీష్‌ కొత్త కుంపటి పెట్టడం ఖాయమన్నారు. ఈరోజు ఇతర పార్టీలకు వచ్చిన పరిస్థితే రేపు కేసీఆర్‌కు తప్పదని రేవంత్ జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్‌లో టీటీడీపీ విలీనం వార్తలపైనా రేవంత్ ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేల తీర్మానంతో పార్టీల విలీనం జరగదన్నారు. ఒకవేళ అలా చేస్తే కోర్టుకు వెళ్తామన్నారు. మరోవైపు నమ్మి నాయకత్వం అప్పగిస్తే ఎర్రబెల్లి దయాకర్‌ రావు నయవంచనకు పాల్పడ్డారని టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఇంతకాలం టీఆర్‌ఎస్‌కు కోవర్టుగా ఎర్రబెల్లి పనిచేశారని సండ్ర ఆరోపించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News