ఇంతకూ ముద్రగడ ఏం సాధించినట్టు ?

తొలుత ముద్రగడ ఉద్యమం ప్రారంభించినప్పుడు చాలా మంది చంద్రబాబు ప్రభుత్వం ఏమైపోతుందో అని భావించారు. కానీ చివరకు అంతా తుస్సుమంది. కనీసం ఒక్కటంటే ఒక్క డిమాండ్‌ను కూడా ముద్రగడ సాధించలేకపోయారు. ముద్రగడ తీరుపై కాపు నేత హరిరామ జోగయ్య కూడా నేరుగా విరుచుకుపడ్డారు. ముద్రగడ సాధించింది శూన్యమని మండిపడ్డారు. నిజమే… ముద్రగడ పెట్టిన డిమాండ్లు, వాటిపై ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన చూస్తే ఈ విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ముద్రగడ పెట్టిన తొలి డిమాండ్ ఏమిటంటే కాపుల […]

Advertisement
Update: 2016-02-08 22:28 GMT

తొలుత ముద్రగడ ఉద్యమం ప్రారంభించినప్పుడు చాలా మంది చంద్రబాబు ప్రభుత్వం ఏమైపోతుందో అని భావించారు. కానీ చివరకు అంతా తుస్సుమంది. కనీసం ఒక్కటంటే ఒక్క డిమాండ్‌ను కూడా ముద్రగడ సాధించలేకపోయారు. ముద్రగడ తీరుపై కాపు నేత హరిరామ జోగయ్య కూడా నేరుగా విరుచుకుపడ్డారు.

ముద్రగడ సాధించింది శూన్యమని మండిపడ్డారు. నిజమే… ముద్రగడ పెట్టిన డిమాండ్లు, వాటిపై ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన చూస్తే ఈ విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ముద్రగడ పెట్టిన తొలి డిమాండ్ ఏమిటంటే కాపుల రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 30ని వెంటనే అమలు చేయాలి. కానీ ఇప్పుడా ఊసే లేదు. దీక్ష విరమించే సమయానికి అంతా జీవో సంగతి మరిచిపోయారు. రెండో డిమాండ్ మంజునాథన్‌ కమిటీ కాల వ్యవధి మూడు నెలలకు తగ్గించాలి. కానీ ఈ విషయంలోనూ ప్రభుత్వానిదే పై చేయి అయింది. ఏడు నెలల ( కమిటీ ప్రకటించిన రోజు నుంచి అయితే 9 నెలలు) కాలపరిమితికి ముద్రగడ అంగీకరించారు. కాపు కార్పొరేషన్‌కు రెండేళ్ల కాలానికి బకాయి పడ్డ 1900 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఆ డిమాండ్ కూడా గాల్లో కలిసిపోయింది.

ఈ ఏడాదికి అదనంగా మరో 500 కోట్లు కేటాయించేందుకు మాత్రమే ప్రభుత్వం అంగీకరించింది. అంటే 1400 కోట్ల సంగతి మరిచారన్న మాట. తుని ఘటనలో నమోదైన కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కానీ దానిపైనా స్పష్టత లేదు. లోతైన విచారణ తర్వాత అరెస్ట్‌లుంటాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అదే సమయంలో ముఖ్యమంత్రి మాత్రం తుని విధ్వంసానికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదంటున్నారు. మొత్తం మీద చూస్తే ముద్రగడ వల్ల కాపులకు కొత్తగా వచ్చిన ప్రయోజం ఏమీ లేదు. అయితే మంజునాథన్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే ముద్రగడ మళ్లీ ఉద్యమం చేస్తారేమో చూడాలి.

ముందు రోజువరకు స్థిరంగా ఉన్న ముద్రగడ ఒక్కరోజులో ఎందుకు మారినట్టో ఎవరికీ అర్ధం కావడంలేదు. ఇంకెవరైనా అయివుంటే డబ్బుకు అమ్ముడుపోయి లొంగిపోయాడని విమర్శలు చేసేవారు. కానీ ముద్రగడ నిజాయితీ ఆంధ్రదేశానికి అంతా తెలుసు. ప్రాణం పోయినా ఆయన అవినీతికి పాల్పడడు. కాబట్టి అవినీతి ప్రస్థావన ఎవరూ చేయడంలేదు. మరైతే ఎందుకు లొంగిపోయాడు? ఒక్కసారిగా చంద్రబాబుకు కాళ్లు కడుగుతాననే స్థాయికి ఎందుకు చేరాడు? ముందురోజు చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేసిన ముద్రగడ మరునాడే ఎందుకు క్ష‌మాపణలు చెప్పాడు? ఒక్కరోజులో ఏం జరిగింది? ఎవరైనా బెదించారా? బ్లాక్ మెయిల్ చేశారా? కేసులలో ఇరికిస్తామని బెదిరించారా? ఇంతకు ఏం జరిగిందనేది ఎవరికీ అంతుపట్టడంలేదు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News