కాపు దీక్ష విరమణ " ఎవరిది పైచేయి?

ఇటీవల తీవ్రరూపం దాల్చిన కాపు ఉద్యమం తాత్కాలికంగా శాంతించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలతో మద్రగడ తన దీక్ష విరమించారు. ఈ నేపథ్యంలో ఎవరు మెట్టుదిగారు?, ఎవరిదిపై చేయి అయింది?, ఎవరేం సాధించారు అన్న దానిపై చర్చ జరుగుతోంది. ముద్రగడ దీక్ష విరమణ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను గమనిస్తే కొత్తవి ఏమీ లేవు. మంజునాథన్ కమిటీకి మూడు నెలలు మాత్రమే గడువు ఇవ్వాలని కాపులు డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంలో సన్నిహితుల సూచనల మేరకు ముద్రగడ […]

Advertisement
Update: 2016-02-08 02:07 GMT

ఇటీవల తీవ్రరూపం దాల్చిన కాపు ఉద్యమం తాత్కాలికంగా శాంతించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలతో మద్రగడ తన దీక్ష విరమించారు. ఈ నేపథ్యంలో ఎవరు మెట్టుదిగారు?, ఎవరిదిపై చేయి అయింది?, ఎవరేం సాధించారు అన్న దానిపై చర్చ జరుగుతోంది. ముద్రగడ దీక్ష విరమణ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను గమనిస్తే కొత్తవి ఏమీ లేవు. మంజునాథన్ కమిటీకి మూడు నెలలు మాత్రమే గడువు ఇవ్వాలని కాపులు డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంలో సన్నిహితుల సూచనల మేరకు ముద్రగడ కాస్త మెత్తబడ్డారు.

కమిషన్‌కు ఏడు నెలల కాలవ్యవధికి(కమిటీ ప్రకటించిన సమయం నుంచి చూస్తే 9 నెలలు) అంగీకరించారు. ఏటా కాపు కార్పొరేషన్‌కు వెయ్యి కేటాయిస్తామని ప్రభుత్వం మరోసారి హామీ ఇచ్చింది. ఇది కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు చెప్పినదే. అయితే ఇప్పటి వరకు కేవలం వంద కోట్లే కేటాయించడంతో కాపులు భగ్గుమన్నారు. ఈ నేపథ్యంలో నిధులకు కేటాయింపుకు ప్రభుత్వం దిగివచ్చింది. ఈఏడాదికి గాను మరో 500 కోట్లు ఇస్తామని వెల్లడించింది. మొత్తం మీద చూస్తే ప్రభుత్వం కొత్తగా ఇచ్చే హామీలేవి కనిపించపు.

తుని విధ్వంసంపై కేసుల విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. లోతైన దర్యాప్తు చేసిన తర్వాతే అరెస్టులుంటాయని ముద్రగడకు ప్రభుత్వం తరపున చర్చల్లో పాల్గొన్న కళావెంకట్రావ్, అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. అయితే ముద్రగడ వ్యూహాత్మకంగానే వెనక్కు తగ్గినట్టు భావిస్తున్నారు. కమిషన్ వేశాక కూడా కొద్ది నెలల పాటు ఓపిక పట్టలేరా అన్న ప్రశ్నను ప్రభుత్వం పదేపదే వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కాస్త గడువు ఇవ్వడమే మంచిదన్న భావనకు ఆయన వచ్చినట్టుగా ఉంది. అంతే కాదు మరోసారి తాను రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి కల్పించవద్దని కోరడం ద్వారా ఒక హెచ్చరిక కూడా చేశారు. అయితే ముద్రగడ దీక్ష తర్వాత కాపుల విషయంలో ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతానికి ఇరువర్గాలు ఒక్కో మెట్టు దిగి కాల్పుల విరమణ ప్రకటించినట్టుగా అయింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News