చంద్రబాబుపై దాసరి ఫైర్

ఏపీ ప్రభుత్వ తీరుపై కేంద్ర మాజీ మంత్రి, కాపు నేత దాసరి నారాయణ రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు . దీక్ష చేస్తున్న ముద్రగడను కలిసేందుకు వెళ్తున్న తనకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడంపై తీవ్రంగా స్పందించారు. ”మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక డిక్టేటర్ పాలనలో ఉన్నామా” అని ప్రశ్నించారు. తనను అడ్డుకునేందుకు కృష్ణాజిల్లా నందిగామ వద్ద పోలీసులను మోహరించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో 144 సెక్షన్ ఉంటే కృష్ణాజిల్లాలో తనను అడ్డుకునేందుకు ప్రయత్నించడం ఏమిటని నిలదీశారు. […]

Advertisement
Update: 2016-02-07 23:50 GMT

ఏపీ ప్రభుత్వ తీరుపై కేంద్ర మాజీ మంత్రి, కాపు నేత దాసరి నారాయణ రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు . దీక్ష చేస్తున్న ముద్రగడను కలిసేందుకు వెళ్తున్న తనకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడంపై తీవ్రంగా స్పందించారు. ”మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక డిక్టేటర్ పాలనలో ఉన్నామా” అని ప్రశ్నించారు. తనను అడ్డుకునేందుకు కృష్ణాజిల్లా నందిగామ వద్ద పోలీసులను మోహరించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.

తూర్పుగోదావరి జిల్లాలో 144 సెక్షన్ ఉంటే కృష్ణాజిల్లాలో తనను అడ్డుకునేందుకు ప్రయత్నించడం ఏమిటని నిలదీశారు. ప్రభుత్వ తీరు వల్ల ఇతర మార్గాల్లో తాను రాజమండ్రి చేరుకునేందుకు 12 గంటలు పట్టిందని ఆవేదన చెందారు. సొంత రాష్ట్రంలోకి దొంగలాగా రావాల్సి వస్తుందని తానెప్పుడు ఊహించలేదన్నారు. క్రిమినల్స్‌లాగా తమను పోలీసులు వెంటాడడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసుల తీరును తాను తప్పుపట్టనని వారికి హెడ్‌గా ఉన్న హెడ్‌కు హెడ్‌ ఉండాలన్నారు. రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే బాధగా ఉందన్నారు.

రాజమండ్రిలో తానున్న హోటల్ చుట్టూ కూడా పోలీసులు ఉన్నారని.. తానేమైనా టెర్రరిస్టునా అని ప్రశ్నించారు. ముద్రగడ తనకు అత్యంత సన్నిహితుడని ఆయన భార్య తనను అన్న అని పిలుస్తారని గుర్తు చేసుకున్నారు . ఆమె ఆరోగ్యం తొలి నుంచి కూడా సరిగా లేదని ఒక్కసారి వెళ్లి పలకరిద్దామంటే ప్రభుత్వం అడ్డుపడడం బాధగా ఉందన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వానికి ఊహించని నష్టం తప్పదని దాసరి హెచ్చరించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News