‘’కాపు’’ అంటే అర్థమేంటి? సీమలో కాపులెవరు?

కాపు రిజర్వేషన్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను షేక్ చేస్తున్న అంశం.  తమను వెనుకబడిన వర్గాల్లో చేర్చాలని కాపులు ఉద్యమించారు. అసలు కాపు అన్న పదం ఎలా వచ్చింది అంటే.. జమిందారి వ్యవస్థ నడిచిన కాలంలో పంటపొలాలు, గ్రామాల రక్షణ బాథ్యతను ఒక వర్గం వారు చూసేవారు. వారే కాపులు. కాపుకాసే వారు కాబట్టి కాపులు అన్న పేరు వచ్చింది. కాపు అన్న పదానికి వ్యవసాయదారుడు అన్న అర్థం కూడా ఉంది.  వ్యవసాయం చేసేవారు కాబట్టి  కాపులు అన్న పేరు వచ్చిందని చెబుతారు. రాయలసీమ ప్రాంతానికి వెళ్తే […]

Advertisement
Update: 2016-02-04 03:52 GMT

కాపు రిజర్వేషన్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను షేక్ చేస్తున్న అంశం. తమను వెనుకబడిన వర్గాల్లో చేర్చాలని కాపులు ఉద్యమించారు. అసలు కాపు అన్న పదం ఎలా వచ్చింది అంటే.. జమిందారి వ్యవస్థ నడిచిన కాలంలో పంటపొలాలు, గ్రామాల రక్షణ బాథ్యతను ఒక వర్గం వారు చూసేవారు. వారే కాపులు. కాపుకాసే వారు కాబట్టి కాపులు అన్న పేరు వచ్చింది. కాపు అన్న పదానికి వ్యవసాయదారుడు అన్న అర్థం కూడా ఉంది. వ్యవసాయం చేసేవారు కాబట్టి కాపులు అన్న పేరు వచ్చిందని చెబుతారు. రాయలసీమ ప్రాంతానికి వెళ్తే రెడ్డి సమాజికవర్గం వారిని కాపులుగా పిలుపుస్తారు. ఇప్పటికీ రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ప్రభుత్వ రికార్డుల్లో రెడ్లను కాపులుగానే పరిగణిస్తారు. రికార్డుల్లో కుల ప్రస్తావన వచ్చినప్పుడు రెడ్లను కాపులు అని రాస్తారు. అందుకే జేసీ దివాకర్ రెడ్డి, తులసి రెడ్డి లాంటి వారు ఈ విషయాన్ని అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు. తిరిగి కాపుల్లో అనేక ఉప కులాలు ఉన్నాయి. పంటకాపులు, పకనాటికాపులు ఇలా రకరకాల ఉప కులాలు ఉన్నాయి.

Click on image to Read

Tags:    
Advertisement

Similar News