నోరుజారి తిట్లు తింటున్న బాబు

తునిలో జరిగిన విధ్వంసంపై స్పందించిన చంద్రబాబు “ఈ సంఘటన ఏ పులివెందులలోనో జరిగిందంటే సరేగాని పీస్‌ఫుల్‌ పీపుల్‌ ఉండే ఈస్ట్గ్‌గోదావరిలో… తునిలో జరిగిందంటే…” నమ్మలేకపోయిన చంద్రబాబును రాయలసీమ వాసులు, నెటిజన్‌లు తెగ తిడుతున్నారు. ఎక్కడో సంఘటన జరిగితే కడపజిల్లా పులివెందులను అవమానపరుస్తూ మాట్లాడడం వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. రాయలసీమవాసి అయిన చంద్రబాబు కృష్ణా నీళ్ళు మరిగి జన్మభూమికి ద్రోహం చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. రాయలసీమలో తగాదాలు, హత్యల్లో కూడా ఒక నీతి ఉంటుందని కానీ చంద్రబాబు అత్యంత ఇష్టపడే ఆ […]

Advertisement
Update: 2016-02-02 05:21 GMT

తునిలో జరిగిన విధ్వంసంపై స్పందించిన చంద్రబాబు “ఈ సంఘటన ఏ పులివెందులలోనో జరిగిందంటే సరేగాని పీస్‌ఫుల్‌ పీపుల్‌ ఉండే ఈస్ట్గ్‌గోదావరిలో… తునిలో జరిగిందంటే…” నమ్మలేకపోయిన చంద్రబాబును రాయలసీమ వాసులు, నెటిజన్‌లు తెగ తిడుతున్నారు. ఎక్కడో సంఘటన జరిగితే కడపజిల్లా పులివెందులను అవమానపరుస్తూ మాట్లాడడం వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. రాయలసీమవాసి అయిన చంద్రబాబు కృష్ణా నీళ్ళు మరిగి జన్మభూమికి ద్రోహం చేస్తున్నాడని విమర్శిస్తున్నారు.

రాయలసీమలో తగాదాలు, హత్యల్లో కూడా ఒక నీతి ఉంటుందని కానీ చంద్రబాబు అత్యంత ఇష్టపడే ఆ ప్రాంతంలో డబ్బునీతి తప్ప ఇంకేనీతికైనా విలువ ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

  • క్లాసు రూములో శ్రీలక్ష్మిని కత్తితో నరికి చంపడం…
  • ఆయేషా మీరాని చంపి ఆ శవంపై చిరుత అని రాయడం…
  • చిన్నారి వైష్ణవిని ఫర్నేస్‌లో తగలబెట్టడం…
  • రిషితేశ్వరి ఆత్మహత్య…
  • ఒక మహిళా అధికారి వనజాక్షిని ఈడ్చి కొట్టడం…
  • కాల్‌మనీ పేరుతో స్త్రీలను లోబరుచుకొని ఆమె ద్వారా ఆమె కూతురుని లొంగదీసుకొని ఆమె ద్వారా ఆమె స్నేహితులని తార్చమని అడగడం…
  • రంగా హత్య అనంతరం… జరిగిన విధ్వంసం… వారాల తరబడి కర్ఫ్యూ… ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతకడం…
  • రాజీవ్‌ హత్య అనంతరం… గృహ దహనాలు… మానభంగాలు…ఇవన్నీ రాయలసీమలో జరగలేదని చాలామంది నెటిజన్‌లు చంద్రబాబుకు గుర్తుచేశారు.

అత్తగారి జిల్లా మైకంలో పడి రాయలసీమ సంస్కృతిని కించపరిస్తే ఊరుకోమని తిడుతూ రాయలసీమవాళ్లు హెచ్చరిస్తున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్‌లు పోటెత్తుతున్నాయి. బాబు వ్యాఖ్యలను ఇతర జిల్లాల వారు కూడా తప్పుపడుతున్నారు. ఏదీ ఏమైనా ఇలాంటి ప్రాంతీయ వైషమ్యాలకు ఆజ్యం పోసేలా చంద్రబాబు భవిష్యత్తులో మాట్లాడకపోవడమే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి నోరు జారి మాట్లాడితే ఇక సామాన్యుల స్పందనను నియంత్రించడం సాధ్యం అయ్యే పనికాదు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News