ఇంటెలిజెన్స్‌ను దారి మళ్లించింది చంద్రబాబేనా?

కాపు గర్జన సందర్భంగా తుని విధ్వంసం విషయంలో ఏపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రిజర్వేషన్లు వంటి సున్నిత అంశంపై జరుగుతున్న సభకు లక్షలాది మంది తరలివస్తున్నవేళ ఏం జరుగుతుందన్నది గుర్తించడంలో ఇంటెలిజెన్స్ పూర్తిగా విఫలమైందన్న అభిప్రాయం ఉంది. అయితే కాపు గర్జనపై ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరే కారణమంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై ప్రముఖ పత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఏపీలో 13 జిల్లాల నుంచి సగానికి […]

Advertisement
Update: 2016-02-01 22:36 GMT

కాపు గర్జన సందర్భంగా తుని విధ్వంసం విషయంలో ఏపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రిజర్వేషన్లు వంటి సున్నిత అంశంపై జరుగుతున్న సభకు లక్షలాది మంది తరలివస్తున్నవేళ ఏం జరుగుతుందన్నది గుర్తించడంలో ఇంటెలిజెన్స్ పూర్తిగా విఫలమైందన్న అభిప్రాయం ఉంది. అయితే కాపు గర్జనపై ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరే కారణమంటూ విమర్శలు వస్తున్నాయి.

ఈ అంశంపై ప్రముఖ పత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఏపీలో 13 జిల్లాల నుంచి సగానికి పైగా మెరికల్లాంటి ఇంటెలిజెన్స్ అధికారులను చంద్రబాబు గ్రేటర్‌ హైదరాబాద్‌కు పంపించారని కథనం చెబుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీడీపీకి ఎలాంటి అవకాశాలున్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు వంటి అంశాలపై డివిజన్ల వారీగా సర్వే నిర్వహించేందుకు ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులను పంపారట.

గ్రేటర్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారానికి ముందే ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్‌లో మోహరించారట. మెరికల్లాంటి అధికారులంతా హైదరాబాద్ సర్వేకు వెళ్లడం వల్లే కాపు గర్జన తీవ్రతను అంచనా వేయలేకపోయారని ప్రభుత్వ యంత్రాంగం అభిప్రాయపడుతోంది.

సాధారణంగా భారీ బహిరంగ సభలు జరిగే సమయంలో పోలీసులు మఫ్టీలో ఉంటూ అంతా పరిశీలిస్తారు. కెమెరాల్లో రహస్యంగా రికార్డు చేస్తారు. కానీ తుని సభలో పోలీసులు ఆ పని కూడా చేయలేదని చెబుతున్నారు. అందుకే టీవీ చానళ్ల నుంచి వీడియోలు సేకరిస్తున్నట్టు సదరు పత్రిక కథనం. ఒక వేళ ఇదే నిజమైతే ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిందే. ఒక రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ను పక్క రాష్ట్రంలో ఎన్నికల సర్వేకు ఒక పార్టీ తరపున వాడుకోవడం సరైన పద్దతి కాదు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News