రౌడీలకు ట్రైనింగ్ ఇచ్చి పంపారు. వాటికి నిధులెక్కడివి?

కాపు రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ వైఖరిపై కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. కాపు గర్జనను విఫలం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కాపు గర్జన సభలో జరిగిన విధ్యంసంపై ముద్రగడ అనుమానం వ్యక్తం చేశారు. విధ్వంసానికి టీడీపీ నేతలే నాయకత్వం వహించారని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం రౌడీలతో సమావేశాలు నిర్వహించి… ట్రైనింగ్ ఇచ్చి పంపారని ముద్రగడ మండిపడ్డారు. ఆ రౌడీలే విధ్వంసం సృష్టించారన్నారు. కేసులు పెట్టాల్సి వస్తే […]

Advertisement
Update: 2016-02-01 03:09 GMT

కాపు రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ వైఖరిపై కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. కాపు గర్జనను విఫలం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కాపు గర్జన సభలో జరిగిన విధ్యంసంపై ముద్రగడ అనుమానం వ్యక్తం చేశారు. విధ్వంసానికి టీడీపీ నేతలే నాయకత్వం వహించారని ఆరోపించారు.

కొద్ది రోజుల క్రితం రౌడీలతో సమావేశాలు నిర్వహించి… ట్రైనింగ్ ఇచ్చి పంపారని ముద్రగడ మండిపడ్డారు. ఆ రౌడీలే విధ్వంసం సృష్టించారన్నారు. కేసులు పెట్టాల్సి వస్తే తనపై పెట్టాలని సామాన్యులపై పెట్టవద్దని కోరారు. కాపు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కాపు సోదరులనే వాడుకుంటున్నారని విమర్శించారు. నాలుగైదు రోజుల్లో తనతో పాటు తన భార్య కూడా ఆమరణ దీక్షకు దిగుతున్నట్టు చెప్పారు. అరెస్ట్ చేస్తే జైల్లోనే ఇద్దరం ఆమరణ దీక్ష చేస్తామని ప్రకటించారు. బెయిల్ కూడా తీసుకోబోమన్నారు.

కాపు గర్జన సమయంలో కొన్ని మీడియా సంస్థను ప్రత్యేక ఎజెండాతో నడిచాయని ఆరోపించారు. కొన్ని పత్రికలు వంకర రాతలు రాస్తున్నాయని విమర్శించారు. డబ్బులు లేకనే కాపు కార్పొరేషన్‌కు తక్కువ మొత్తం కేటాయించామంటున్న చంద్రబాబు… పట్టిసీమ నిర్మాణానికి, పప్పులు బెల్లాలు పంచిపెట్టడానికి నిధులెక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చకుండా… మేనిఫెస్టోలో చెప్పని పట్టిసీమ, పప్పులు బెల్లాల పంపిణీకి నిధులెక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

భయంకర పరిస్థితిని సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. తాను అమ్ముడు పోయానని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు… తాను గతంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అప్పుడు తనను టీడీపీ నేతలు ఎన్నికోట్లకు కొన్నారో చెప్పాలన్నారు.

Click on Image to Read:

 

Advertisement

Similar News