దాసరికీ తప్పని వేధింపులు- ఫిర్యాదు

దర్శకుడు దాసరి నారాయణ కూడా ఫేస్ బుక్ బాధితుల జాబితాలో చేరిపోయారు. ఇటీవల సెలబ్రేటీలపై ఫేస్ బుక్ లో ఇష్టానుసారం పోస్టులు పెట్టడం కామనైపోయింది. ఈ తరహాలోనే కొందరు దాసరిపై అనుచిత పోస్ట్ పెట్టారు. దాసరి నారాయణరావు చనిపోయారంటూ ఫోటోలు పెట్టి ప్రచారం చేస్తున్నారు. దీనిపై జూబ్లిహిల్స్ పోలీసులకు దాసరి ఫిర్యాదు చేశారు. వారం రోజులుగా ఫేస్ బుక్, ఇతర మాధ్యమాలలో ఈ తరహా ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయని ఫిర్యాదులో తెలిపారు. ఇలా ఎందుకు జరుగుతోందో తనకు […]

Advertisement
Update: 2016-01-30 22:27 GMT

దర్శకుడు దాసరి నారాయణ కూడా ఫేస్ బుక్ బాధితుల జాబితాలో చేరిపోయారు. ఇటీవల సెలబ్రేటీలపై ఫేస్ బుక్ లో ఇష్టానుసారం పోస్టులు పెట్టడం కామనైపోయింది. ఈ తరహాలోనే కొందరు దాసరిపై అనుచిత పోస్ట్ పెట్టారు. దాసరి నారాయణరావు చనిపోయారంటూ ఫోటోలు పెట్టి ప్రచారం చేస్తున్నారు. దీనిపై జూబ్లిహిల్స్ పోలీసులకు దాసరి ఫిర్యాదు చేశారు. వారం రోజులుగా ఫేస్ బుక్, ఇతర మాధ్యమాలలో ఈ తరహా ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయని ఫిర్యాదులో తెలిపారు. ఇలా ఎందుకు జరుగుతోందో తనకు అర్థం కావడం లేదన్నారు. ఈ ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో దాసరి నారాయణ కోరారు. ఆ మధ్య పవన్ ఫ్యాన్స్, దర్శకుడు వర్మ మధ్య కూడా ఇలాంటి గొడవే నడిచింది. మెగా హీరోలపై ట్వీట్లు పెట్టిన వర్మకు పవన్ అభిమానులు దండేశారు. వర్మ చనిపోయాడంటూ ఫేస్ బుక్ లో ఫొటోలు పెట్టారు. ఇప్పుడు తాజాగా దాసరి ఆ జాబితాలో చేరారు. అయితే దాసరిపై ఎవరు ఇలాంటి పోస్టులు పెట్టారన్నది తేలాల్సి ఉంది.

Click on image to read:

 

 

 

Tags:    
Advertisement

Similar News