కేటీఆర్‌కు ప్రమోషన్ ప్రకటించిన కేసీఆర్

గ్రేటర్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న కేటీఆర్‌ను ఒక్కో మెట్టు రాజకీయంగా పైకి ఎక్కించేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయినట్టు అర్థమవుతోంది. శనివారం గ్రేటర్‌లో నిర్వహించిన టీఆర్ఎస్‌ సభలో కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు తన వద్ద ఉన్న మున్సిపల్ శాఖను కూడా కేటీఆర్‌కు అప్పగిస్తున్నట్టు చెప్పారు. గ్రేటర్‌ ఎన్నికల్లో కేటీఆర్ వీధివీధి తిరిగి శ్రమిస్తున్నారని హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే బాధ్యత కూడా ఆయనకే అప్పగిస్తామన్నారు. ‘నా కొడుకు కేటీ రామారావు […]

Advertisement
Update: 2016-01-30 14:11 GMT

గ్రేటర్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న కేటీఆర్‌ను ఒక్కో మెట్టు రాజకీయంగా పైకి ఎక్కించేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయినట్టు అర్థమవుతోంది. శనివారం గ్రేటర్‌లో నిర్వహించిన టీఆర్ఎస్‌ సభలో కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు తన వద్ద ఉన్న మున్సిపల్ శాఖను కూడా కేటీఆర్‌కు అప్పగిస్తున్నట్టు చెప్పారు. గ్రేటర్‌ ఎన్నికల్లో కేటీఆర్ వీధివీధి తిరిగి శ్రమిస్తున్నారని హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే బాధ్యత కూడా ఆయనకే అప్పగిస్తామన్నారు. ‘నా కొడుకు కేటీ రామారావు గ్రేటర్ లో ఒక్కతీరుగ తిరుగుతున్నడు. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నరు. నగర అభివృద్ధిలో మున్సిపల్ శాఖది కీలక పాత్ర. ప్రస్తుతం నా దగ్గరే ఉన్న మున్సిపల్ శాఖను కేటీఆర్ కు అప్పజెప్పి హైదరాబాద్ అభివృద్ధికి బాటలేస్త’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News