13 జిల్లాలు ఊడ్చుకో... కేసీఆర్‌ నోట కాల్‌మనీ మాట‌

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ సుధీర్ఘంగా మీడియా సమావేశం నిర్వహించారు. విలేకర్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పుపట్టారు కేసీఆర్. అసలు చంద్రబాబుకు హైదరాబాద్‌లో ఏం పని ఉందని ప్రశ్నించారు. చంద్రబాబు ఊడ్చుకోవడానికి 13 జిల్లాలు ఉన్నాయని ముందు వాటి సంగతి చూసుకోవాలని సూచించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో చంద్రబాబు ప్రయాస వృథా అని అన్నారు.  కాల్ మనీ సృష్టికర్తలంతా వచ్చి హైదరాబాద్‌లో ఓట్లడుగుతున్నారని … ప్రజలు జాగ్రత్తగా […]

Advertisement
Update: 2016-01-28 06:12 GMT

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ సుధీర్ఘంగా మీడియా సమావేశం నిర్వహించారు. విలేకర్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పుపట్టారు కేసీఆర్. అసలు చంద్రబాబుకు హైదరాబాద్‌లో ఏం పని ఉందని ప్రశ్నించారు. చంద్రబాబు ఊడ్చుకోవడానికి 13 జిల్లాలు ఉన్నాయని ముందు వాటి సంగతి చూసుకోవాలని సూచించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో చంద్రబాబు ప్రయాస వృథా అని అన్నారు. కాల్ మనీ సృష్టికర్తలంతా వచ్చి హైదరాబాద్‌లో ఓట్లడుగుతున్నారని … ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలని కేసీఆర్ కోరారు. చంద్రబాబు పాలన గురించి చెప్పాలంటే హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఉందని ఎద్దేవా చేశారు.

టీడీపీని గెలిపిస్తే హైదరాబాద్‌ అభివృద్ధికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. అమరావతికే దిక్కులేదు… ఇక హైదరాబాద్‌కు ఎక్కడి నుంచి నిధులు తెస్తారన్నారు. ఓట్ల కోసం హైదరాబాద్‌లో ప్రజలను రెచ్చగొట్టవద్దని కోరారు. హైదరాబాద్‌లో ఉన్న వారంతా తమవారేనని అన్నారు.

కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. తాజాగా ఎంపిక చేసిన స్మార్ట్‌ సిటీల్లో తెలంగాణ నుంచి ఒక్క నగరం కూడా ఎంపిక కాకపోవడంపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. దీనిపై వెంకయ్యనాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెంకయ్య అంత్యప్రాసలు, ఆది ప్రాసల గురించి అందరికీ తెలుసన్నారు. తాను కూడా వెంకయ్యలాగే ప్రాసలతో మాట్లాడగలనని… చిల్లర ప్రచారాల ద్వారా కేసీఆర్‌పై పైచేయి సాధించాలనుకోవడం సరైదని కాదన్నారు.

ఎంఐఎం తమకు మిత్రపక్షమేనన్నారు కేసీఆర్. గ్రేటర్ వంద స్థానాలు టీఆర్‌ఎస్ గెలవకపోతే రాజీనామా చేస్తానని కేటీఆర్ అనలేదన్నారు. హైదరాబాద్‌కు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు టాయిలెట్స్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ అన్నారు. అందుకే నగరంలో 250 పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తామని చెప్పారు. గ్రేటర్‌లో టీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమన్నారు. కొత్త సచివాలయం కట్టి తీరుతామన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News