వర్మకు వంగవీటిరాధా ఓపెన్‌వార్నింగ్‌ వెనుక ?

వివాదాస్పద డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పటికే రక్తచరిత్ర పేరుతో అనంతపురం ఫ్యాక్షన్‌ కథను చూపించి విమర్శలు ఎదుర్కొన్న వర్మ లేటెస్ట్‌గా బెజవాడ స్టోరీపై పడ్డారు. త్వరలోనే వంగవీటి రంగా హత్య, తదితర అంశాలపై సినిమా తీస్తానని ప్రకటించారు. టైటిల్ కూడా ”వంగవీటి” అని ప్రకటించారు. అయితే వర్మ తీయబోయే చిత్రం వెనుక కొందరు రంగా వ్యతిరేకులున్నారన్నది వంగవీటి అభిమానుల అనుమానం. సినిమా ద్వారా రంగాను నెగిటివ్‌గా చూపించే ప్రయత్నం జరుగుతోందని అనుమానిస్తున్నారు. ఈనేపథ్యంలో వంగవీటి […]

Advertisement
Update: 2016-01-24 22:31 GMT

వివాదాస్పద డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పటికే రక్తచరిత్ర పేరుతో అనంతపురం ఫ్యాక్షన్‌ కథను చూపించి విమర్శలు ఎదుర్కొన్న వర్మ లేటెస్ట్‌గా బెజవాడ స్టోరీపై పడ్డారు. త్వరలోనే వంగవీటి రంగా హత్య, తదితర అంశాలపై సినిమా తీస్తానని ప్రకటించారు. టైటిల్ కూడా ”వంగవీటి” అని ప్రకటించారు. అయితే వర్మ తీయబోయే చిత్రం వెనుక కొందరు రంగా వ్యతిరేకులున్నారన్నది వంగవీటి అభిమానుల అనుమానం. సినిమా ద్వారా రంగాను నెగిటివ్‌గా చూపించే ప్రయత్నం జరుగుతోందని అనుమానిస్తున్నారు.

ఈనేపథ్యంలో వంగవీటి రంగా కుమారుడు రాధా స్పందించారు. ఒక టీవీ చానల్‌తో మాట్లాడుతూ వర్మ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలో వాస్తవాలు చూపెడితే తనకెలాంటి అభ్యంతరం లేదని ఒకవేళ రంగా జీవితంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కొడుకుగా తానెంత స్పందిస్తానో అంతకంటే ఎక్కువగా రంగా అభిమానుల నుంచి రియాక్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని ముందస్తు హెచ్చరిక జారీ చేశారు రాధా. వర్మ పక్షపాత ధోరణి గురించి అందరికీ తెలుసన్నారు. ఒక వర్గం వైపు వర్మ మొగ్గుచూపుతారన్న అనుమానాన్ని రాధా వ్యక్తం ఏశారు. తమ ఇంటి పేరుతో ఇష్టమొచ్చినట్లు సినిమాలు తీసి, అవాకులు, చవాకులు పేలితే అందుకు వర్మ తగిన మూల్యం చెల్లించుకుంటాడని హెచ్చరించారు. సినిమాకు సంబంధించి వర్మ తమ కుటుంబాన్ని సంప్రదించలేదని చెప్పారు వంగవీటి రాధా.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News