మరణంపై ఎన్టీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

నాన్నకు ప్రేమతో చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్‌ ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మరణం గురించి మాట్లాడారు. 2009 ఎన్నికల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గుర్తు చేసుకున్న ఎన్టీఆర్‌ … తాను చావుకు భయపడే వ్యక్తిని కాదన్నారు. చావు తనదాకా వస్తే సంతోషంగా వెళ్లిపోతానని చెప్పారు. పుట్టిన ప్రతి మనిషి చావాల్సిందేనని.. ఆశ అనే చిన్న రేఖపై మనిషి బతుకుతున్నాడన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసని ప్రశ్నించారు. అయితే […]

Advertisement
Update: 2016-01-25 06:38 GMT

నాన్నకు ప్రేమతో చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్‌ ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మరణం గురించి మాట్లాడారు. 2009 ఎన్నికల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గుర్తు చేసుకున్న ఎన్టీఆర్‌ … తాను చావుకు భయపడే వ్యక్తిని కాదన్నారు. చావు తనదాకా వస్తే సంతోషంగా వెళ్లిపోతానని చెప్పారు. పుట్టిన ప్రతి మనిషి చావాల్సిందేనని.. ఆశ అనే చిన్న రేఖపై మనిషి బతుకుతున్నాడన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసని ప్రశ్నించారు. అయితే తాను చనిపోయే సమయానికి ఒక్క క్షణం కూడా గిల్టీగా ఫీలవుకూడదన్నదే తన కోరికన్నారు.

2009 మార్చి 26న జరిగిన రోడ్డు ప్రమాదం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పారు. ఆ రోజును తాను రెండో జన్మగా భావిస్తానన్నారు. అందుకే అదే రోజు తన భార్య పుట్టిన రోజు కూడా కావడంతో రెండు పుట్టిన రోజులు చేసుకుంటామన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో చనిపోతానన్న బాధ లేదని… అయితే సాధించాల్సింది ఇంకా చాలా ఉండగానే వెళ్లిపోతున్నానన్న బాధ వెంటాడిందని చెప్పారు. కానీ అభిమానుల ఆశీస్సులతో బతికానన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News