ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది.  విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణపై కోర్టు స్టే విధించింది. ఎయిర్‌పోర్టు కోసం 5312 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.  అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు.  ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎయిర్‌పోర్టు కోసం ప్రభుత్వం 5 వేలకు పైగా ఎకరాలను సేకరించేందుకు సిద్ధపడడాన్ని కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లను విచారించిన కోర్టు భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్ ఇచ్చిన నోటిఫికేషన్‌పై స్టే […]

Advertisement
Update: 2016-01-25 05:16 GMT

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణపై కోర్టు స్టే విధించింది. ఎయిర్‌పోర్టు కోసం 5312 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎయిర్‌పోర్టు కోసం ప్రభుత్వం 5 వేలకు పైగా ఎకరాలను సేకరించేందుకు సిద్ధపడడాన్ని కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లను విచారించిన కోర్టు భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్ ఇచ్చిన నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చింది. నిర్వాసితుల అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాతే ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ముందుకెళ్లాలని ఆదేశించింది. ఎయిర్‌ భూసేకరణ వల్ల దాదాపు 12 గ్రామాల ప్రజలు రోడ్డునపడనున్నారు. హైకోర్టు తీర్పుపై భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News