అచ్చెన్న ప్రతాపం- ఆస్పత్రి పాలైన మహిళా అధికారి

మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహారం మరోసారి వివాదాస్పదమైంది. మంత్రి ఆగ్రహానికి ఒక మహిళా అధికారి స్పృహకోల్పోయి ఆస్పత్రిపాలైంది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం రహిమాన్‌పురం పంచాయతీ కార్యదర్శిగా త్రివేణి పనిచేస్తోంది. ఆమెను నిమ్మాడలోని తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకున్న అచ్చెన్నాయుడు తమ కార్యకర్తలు కోరిన విధంగా మరణ ధృవీకరణ పత్రం ఇవ్వాలని త్రివేణిపై ఒత్తిడి తెచ్చారు. ఈనెల 6న నరసన్నపేట ఆస్పత్రిలో ఆదినారాయణ అనే వ్యక్తి చనిపోయాడు. అతడి విషయంలో మరణ ధృవీకరణ పత్రం ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. […]

Advertisement
Update: 2016-01-20 02:39 GMT

మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహారం మరోసారి వివాదాస్పదమైంది. మంత్రి ఆగ్రహానికి ఒక మహిళా అధికారి స్పృహకోల్పోయి ఆస్పత్రిపాలైంది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం రహిమాన్‌పురం పంచాయతీ కార్యదర్శిగా త్రివేణి పనిచేస్తోంది. ఆమెను నిమ్మాడలోని తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకున్న అచ్చెన్నాయుడు తమ కార్యకర్తలు కోరిన విధంగా మరణ ధృవీకరణ పత్రం ఇవ్వాలని త్రివేణిపై ఒత్తిడి తెచ్చారు. ఈనెల 6న నరసన్నపేట ఆస్పత్రిలో ఆదినారాయణ అనే వ్యక్తి చనిపోయాడు. అతడి విషయంలో మరణ ధృవీకరణ పత్రం ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. అయితే ఆస్పత్రిలో చనిపోయిన వ్యక్తికి తాను ధృవీకరణ పత్రం ఇవ్వలేనని త్రివేణి చెప్పింది. దీంతో మంత్రికి ఆగ్రహం వచ్చింది. ఆ సమయంలో ఆమె అక్కడే కుప్పకూలిపడిపోయారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. టీడీపీ నేతలు మాత్రం త్రివేణి సొంతపనిమీద నిమ్మాడకు వెళ్లి అనారోగ్యంతో స్పృహ కోల్పోయారని చెబుతున్నారు. మంత్రి, టీడీపీ నేతల తీరుపై ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా అధికారులను పిలిపించుకుని ఒత్తిడి తేవడం సరికాదంటున్నారు.

Tags:    
Advertisement

Similar News