ఏపీ ప్రజలకు హై ఓల్టేజ్ షాక్

ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇవ్వబోతోంది. గతేడాది ఏప్రిల్‌లో రూ. 941 కోట్ల మేర విద్యుత్  చార్జీలు పెంచిన ప్రభుత్వం ఈసారి కూడా భారీగానే వడ్డించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈఆర్సీకి టారిఫ్ పెంపు ప్రతిపాదనలను డిస్కంలు సమర్పించాయి. ఈఆర్సీ ఆమోదం తెలిపితే ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. ఈ పెంపు వల్ల రాష్ట్ర ప్రజలపై 783 కోట్ల రూపాయల భారం పడనుంది. 2016-17లో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాకు 28 వేల 423 కోట్లు అవసరమవుతాయని డిస్కంలు […]

Advertisement
Update: 2016-01-19 00:39 GMT

ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇవ్వబోతోంది. గతేడాది ఏప్రిల్‌లో రూ. 941 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచిన ప్రభుత్వం ఈసారి కూడా భారీగానే వడ్డించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈఆర్సీకి టారిఫ్ పెంపు ప్రతిపాదనలను డిస్కంలు సమర్పించాయి. ఈఆర్సీ ఆమోదం తెలిపితే ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. ఈ పెంపు వల్ల రాష్ట్ర ప్రజలపై 783 కోట్ల రూపాయల భారం పడనుంది. 2016-17లో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాకు 28 వేల 423 కోట్లు అవసరమవుతాయని డిస్కంలు తన ప్రతిపాదనల్లో వెల్లడించాయి. చార్జీల రూపంలో 23 వేల 275 కోట్లు వస్తాయని తెలిపిన డిస్కంలు 5 వేల 148 కోట్ల ఆర్థిక లోటును చూపించాయి. ప్రభుత్వ సబ్సిడీ పోగా లోటును పూడ్చుకునేందుకు 783 కోట్ల మేర చార్జీలు పెంచాలని ప్రతిపాదించింది.

అంతేకాదు ఈ ఏడాది నుంచి కొత్త శ్లాబును అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నెలకు 50 యూనిట్ల కంటే తక్కువ వాడే వారి వాడకాన్ని ఏడాది మొత్తం లెక్కించనున్నారు. అంటే ఏడాది మొత్తంలో 600 యూనిట్ల కంటే ఒక్క యూనిట్ ఎక్కువ వాడినా వచ్చే ఏడాది నుంచి తదుపరి శ్లాబ్‌లోకి వెళ్లిపోతారు. అప్పుడు యూనిట్‌ ధర ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త శ్లాబ్ అమలులోకి వస్తే 40 లక్షల పేద కుటుంబాలపై భారం పడుతుంది. రైతుల సాగునీటి ఎత్తిపోతల పథకాలపైనా చార్జీల వడ్డింపుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కుటీర పరిశ్రమ, చేతి వృత్తులపైనా భారం పడనుంది.

Tags:    
Advertisement

Similar News