దేవుడా... ఇది నిజమా?.. సాధ్యమా?

బిల్‌ క్లింటన్. ప్రపంచానికి పెద్దన్నలాంటి అమెరికా మాజీ అధ్యక్షుడు. టోని బ్లెయిర్‌. బ్రటన్ మాజీ అధ్యక్షుడు. ప్రపంచంతోనే సలాం కొట్టించుకున్న నాయకులు వీరు. అలాంటి వ్యక్తులు భారతదేశంలోని ఒక రాష్ట్రానికి చెందిన ఒక కమిటీలో సలహాదారుడి పోస్టులో ఉండేందుకు ఒప్పుకుంటారా?. అసలు క్లింటన్‌, టోనీ బ్లెయిర్‌ను ఇలాంటి పోస్టులో నియమించాలన్న ఆలోచన చేసే సాహసమైనా ఎవరైనా చేయగలరా?. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి మండలికి క్లింటన్‌, బ్లెయిర్‌ను సలహాదారుగా నియమించాలని ఆదేశించారు. బాబు […]

Advertisement
Update: 2016-01-16 22:22 GMT

బిల్‌ క్లింటన్. ప్రపంచానికి పెద్దన్నలాంటి అమెరికా మాజీ అధ్యక్షుడు. టోని బ్లెయిర్‌. బ్రటన్ మాజీ అధ్యక్షుడు. ప్రపంచంతోనే సలాం కొట్టించుకున్న నాయకులు వీరు. అలాంటి వ్యక్తులు భారతదేశంలోని ఒక రాష్ట్రానికి చెందిన ఒక కమిటీలో సలహాదారుడి పోస్టులో ఉండేందుకు ఒప్పుకుంటారా?. అసలు క్లింటన్‌, టోనీ బ్లెయిర్‌ను ఇలాంటి పోస్టులో నియమించాలన్న ఆలోచన చేసే సాహసమైనా ఎవరైనా చేయగలరా?. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి మండలికి క్లింటన్‌, బ్లెయిర్‌ను సలహాదారుగా నియమించాలని ఆదేశించారు. బాబు చెప్పడమే ఆలస్యం మండలి సీఈవో కృష్ణకిషోర్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మరో విషయం ఏమిటంటే ఈ కమిటీకి చంద్రబాబు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. క్లింటన్, బ్లెయిరే కాదు బిల్‌గేట్స్‌ను కూడా సలహాదారుగా నియమించాలని ఆదేశించారు.రతన్ టాటా, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌, అనంద్‌ మహేంద్ర, దీపక్ పరిఖ్ ఇలా ప్రపంచంలోని పెద్ద తలకాయలన్నింటినీ తాను చైర్మన్‌గా కమిటీకి సలహాదారుగా నియమించాలని బాబు ఆదేశించారు. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే చంద్రబాబు ఆలోచన ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. అమెరికా, బ్రిటన్ మాజీ అధ్యక్షులను సలహాదారులుగా నియమించుకునేందుకు చంద్రబాబు ఎలాంటి ఎత్తులు వేస్తారో చూడాలి.అది నిజమైతే ఒక అద్భుతమే.

Click to Read:

Tags:    
Advertisement

Similar News