ఇస్తే చేసి చూపిస్తా..

మంత్రి పదవిపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నారావారిపల్లె వెళ్లిన బాలయ్య అక్కడ మీడియాతో మాట్లాడారు. మీరు మంత్రి ఎప్పుడవుతారని ప్రశ్నించగా మంత్రి పదవిపై తుది నిర్ణయం సీఎందే అన్నారు. మంత్రి పదవి ఇస్తే మాత్రం సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పారు. పరోక్షంగా మంత్రి పదవి  తీసుకునేందుకు తాను సిద్ధమని వెల్లడించారు.   అభిమానులే తన బలం అన్నారు. డిక్టేటర్ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. తన వందో సినిమాలో మోక్షజ్ఞ నటించే అవకాశం […]

Advertisement
Update: 2016-01-15 01:38 GMT

మంత్రి పదవిపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నారావారిపల్లె వెళ్లిన బాలయ్య అక్కడ మీడియాతో మాట్లాడారు. మీరు మంత్రి ఎప్పుడవుతారని ప్రశ్నించగా మంత్రి పదవిపై తుది నిర్ణయం సీఎందే అన్నారు. మంత్రి పదవి ఇస్తే మాత్రం సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పారు. పరోక్షంగా మంత్రి పదవి తీసుకునేందుకు తాను సిద్ధమని వెల్లడించారు. అభిమానులే తన బలం అన్నారు. డిక్టేటర్ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. తన వందో సినిమాలో మోక్షజ్ఞ నటించే అవకాశం ఉందన్నారు. అయితే దీనిపై ఇప్పుడే తుది నిర్ణయం చెప్పలేనన్నారు. తన వారసుడిగా మోక్షజ్ఞ సినీరంగంలోకి వస్తాడని బాలయ్య చెప్పారు.

Tags:    
Advertisement

Similar News