డిసప్పాయింట్ చేసిన డిక్టేటర్

డిక్టేటర్ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఆ మూవీ థియేటర్లలోకి రావడానికి ఇంకొన్ని గంటలు సమయం ఉంది. కానీ అంతకంటే ముందే డిక్టేటర్ డిసప్పాయింట్ చేశాడంటున్నారు ఓవర్సీస్ ప్రేక్షకులు. దీనికి కారణం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటరే అని ఆరోపిస్తున్నారు. తన 99వ సినిమాగా డిక్టేటర్ మూవీ చేశాడు బాలయ్య. ఈ సినిమా హక్కులు దక్కించుకున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్… బాలయ్య 99వ సినిమాకు గుర్తుగా…. డిక్టేటర్ ను ఓవర్సీస్ లో 99 సెంటర్లలో రిలీజ్ చేస్తానని ఘనంగా ప్రకటించాడు. దానికి […]

Advertisement
Update: 2016-01-12 21:00 GMT
డిక్టేటర్ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఆ మూవీ థియేటర్లలోకి రావడానికి ఇంకొన్ని గంటలు సమయం ఉంది. కానీ అంతకంటే ముందే డిక్టేటర్ డిసప్పాయింట్ చేశాడంటున్నారు ఓవర్సీస్ ప్రేక్షకులు. దీనికి కారణం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటరే అని ఆరోపిస్తున్నారు. తన 99వ సినిమాగా డిక్టేటర్ మూవీ చేశాడు బాలయ్య. ఈ సినిమా హక్కులు దక్కించుకున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్… బాలయ్య 99వ సినిమాకు గుర్తుగా…. డిక్టేటర్ ను ఓవర్సీస్ లో 99 సెంటర్లలో రిలీజ్ చేస్తానని ఘనంగా ప్రకటించాడు. దానికి సంబంధించి ప్రచారం కూడా భారీగా చేశాడు. ఓవర్సీస్ టిక్కెట్ కూడా భారీ మొత్తానికి అమ్ముడుపోయింది. అంతా బాగుందనుకున్న టైమ్ లో… ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ షాకిచ్చాడు. 99 సెంటర్లు అని చెప్పి కేవలం 65 సెంటర్లకే సినిమాను పరిమితం చేశాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఇప్పటికే నిర్మాతకు, బాలయ్యకు సమాచారం అందించిన ఎన్నారై నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు… సినిమా విడుదలకు ఇంకొన్ని గంటలు మాత్రమే టైం ఉంది కాబట్టి… వెంటనే సదరు డిస్ట్రిబ్యూటర్ ను హెచ్చరించాలని కోరారు. మరి దీనిపై డిక్టేటర్ టీం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Click to Read:
Tags:    
Advertisement

Similar News