కిడ్నీని అమ్మ‌కానికి పెట్టిన స్క్వాష్ బంగారు ప‌త‌కాల విజేత‌!

ఖండాంతరాలు దాటి ఆట‌ల పోటీల్లో ప‌త‌కాలు గెలుచుకుని వ‌చ్చిన‌వారిని ఏమ‌నాలి? భార‌త‌దేశ‌పు ముద్దుబిడ్డ‌లు అనేగా. దేశ కీర్తిని పెంచేవార‌నే క‌దా.  ఉత్త‌ర ప్ర‌దేశ్‌కి చెందిన ర‌వి దీక్షిత్ కూడా అలాంటి యువ‌కుడే. ఇర‌వై సంవ‌త్ప‌రాల ర‌వి 2010 ఏషియ‌న్ జూనియ‌ర్ ఛాంపియ‌న్ షిప్ గెలిచిన స్క్వాష్ ప్లేయ‌ర్‌. అత‌ను వ‌చ్చేనెల‌లో ద‌క్షిణ ఆసియాలో జ‌ర‌గ‌నున్న ఆట‌ల‌పోటీల‌కు వెళ్లాల‌నుకుంటున్నాడు. స్క్వాష్‌లో త‌న స‌త్తా ఇప్ప‌టికే చాటినా, ఇప్పుడు పోటీలకు సిద్ధం కావ‌డానికి అత‌నికి ప్ర‌భుత్వం నుండి ఎలాంటి ప్రోత్సాహం, […]

Advertisement
Update: 2016-01-12 03:51 GMT

ఖండాంతరాలు దాటి ఆట‌ల పోటీల్లో ప‌త‌కాలు గెలుచుకుని వ‌చ్చిన‌వారిని ఏమ‌నాలి? భార‌త‌దేశ‌పు ముద్దుబిడ్డ‌లు అనేగా. దేశ కీర్తిని పెంచేవార‌నే క‌దా. ఉత్త‌ర ప్ర‌దేశ్‌కి చెందిన ర‌వి దీక్షిత్ కూడా అలాంటి యువ‌కుడే. ఇర‌వై సంవ‌త్ప‌రాల ర‌వి 2010 ఏషియ‌న్ జూనియ‌ర్ ఛాంపియ‌న్ షిప్ గెలిచిన స్క్వాష్ ప్లేయ‌ర్‌. అత‌ను వ‌చ్చేనెల‌లో ద‌క్షిణ ఆసియాలో జ‌ర‌గ‌నున్న ఆట‌ల‌పోటీల‌కు వెళ్లాల‌నుకుంటున్నాడు. స్క్వాష్‌లో త‌న స‌త్తా ఇప్ప‌టికే చాటినా, ఇప్పుడు పోటీలకు సిద్ధం కావ‌డానికి అత‌నికి ప్ర‌భుత్వం నుండి ఎలాంటి ప్రోత్సాహం, ఆర్థిక స‌హాయం అంద‌లేదు. అందుకే పోటీల‌కు ప్రిపేర్ అయ్యేందుకు అవ‌స‌ర‌మైన డ‌బ్బుకోసం త‌న కిడ్నీని సోష‌ల్ మీడియాలో అమ్మ‌కానికి పెట్టాడు. మ‌న‌దేశంలో క్రీడాకారుల దుస్థితికి ర‌విదీక్షిత్ మ‌రొక‌సారి ప్ర‌త్య‌క్ష్య సాక్షిగా నిలిచాడు.

ప‌దేళ్లుగా స్వ్యాష్ ఆడుతున్నాన‌ని, అనేక సార్లు భార‌త్‌కి ప్రాతినిధ్యం వ‌హించినా, ఎన్నో మెడ‌ల్స్ సంపాదించినా, జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయి పోటీల‌కు వెళ్లేందుకు త‌న‌కు ఆర్థిక అండ క‌రువైంద‌ని అత‌ను వాపోయాడు. ధంపూర్ షుగ‌ర్‌ మిల్ ఇప్ప‌టివ‌ర‌కు త‌న‌ను స‌పోర్టు చేసింద‌ని, కానీ ఆ సంస్థ ఒక్క‌దానిపైనే ఎన్నాళ్ల‌ని ఆధార‌ప‌డ‌గ‌ల‌న‌ని ర‌వి అంటున్నాడు. వ‌చ్చేనెల‌లో గౌహ‌తిలో జ‌ర‌గ‌నున్న పోటీల‌కు భార‌త్ త‌ర‌పున ఆడుతున్న‌ట్టుగా, ఆ టోర్న‌మెంటుకోసం చెన్నైలో శిక్ష‌ణ తీసుకోవాల్సి ఉంద‌ని, త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకునేంత స్థోమ‌త త‌న‌కు లేద‌ని ర‌వి సోష‌ల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నాడు. అందుకే 8ల‌క్ష‌ల రూపాయల‌కు త‌న కిడ్నీని బేరం పెడుతున్నాన‌ని, కావాల్సిన వారు త‌న‌ను సంప్ర‌దించాల్సిందిగా కోరాడు.

దీనిపై ర‌వి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. ర‌వి తండ్రి ధంపూర్ షుగ‌ర్ మిల్‌లో నాల్గ‌వ త‌ర‌గ‌తి ఉద్యోగిగా ప‌నిచేస్తున్నాడు. ర‌వి త‌న ఆట‌మీద సంపాదించినా, దాన్ని తాము త‌మ కుమార్తె పెళ్లికి ఖ‌ర్చు చేశామ‌ని అందుకే ర‌వికి ఆర్థిక ఇబ్బందులు వ‌చ్చాయ‌ని, ఎలాగొలా అత‌నికి డ‌బ్బు ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ర‌వికి ఇంకా స‌హాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని ధంపూర్ షుగ‌ర్ మిల్ యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. యుపి మంత్రి మూల్‌చంద్ చౌహాన్ ర‌వికి అండ‌గా నిల‌బ‌డ‌తామ‌ని, అత‌ని విష‌యాన్ని ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ దృష్టికి తీసుకువెళ‌తామ‌ని ప్ర‌క‌టించారు. ర‌వికి స‌మ‌యానికి త‌గిన స‌హాయం అందుతుంద‌ని ఆశిద్దాం.

Tags:    
Advertisement

Similar News