రాజ్యసభకు రామకృష్ణుడు !

ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాజ్యసభకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. జూన్‌లో ఏపీ నుంచి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో ఒకటి యనమల కోసం రిజర్వ్ చేసినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. చాలాకాలంగా యనమల కూడా తనను రాజ్యసభకు పంపాలని చంద్రబాబును కోరుతున్నారు. జూన్ నెలలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కాంగ్రెస్‌ కోటాలో ఉన్న జేడీ శీలం, జైరాం రమేష్‌ పదవి కాలం జూన్‌తో ముగుస్తోంది. సుజనాచౌదరి, నిర్మలా సీతారామన్‌ పదవీకాలం […]

Advertisement
Update: 2016-01-05 01:16 GMT

ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాజ్యసభకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. జూన్‌లో ఏపీ నుంచి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో ఒకటి యనమల కోసం రిజర్వ్ చేసినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. చాలాకాలంగా యనమల కూడా తనను రాజ్యసభకు పంపాలని చంద్రబాబును కోరుతున్నారు. జూన్ నెలలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కాంగ్రెస్‌ కోటాలో ఉన్న జేడీ శీలం, జైరాం రమేష్‌ పదవి కాలం జూన్‌తో ముగుస్తోంది. సుజనాచౌదరి, నిర్మలా సీతారామన్‌ పదవీకాలం కూడా అప్పుడే ముగుస్తుంది. ఈ నాలుగు స్థానాల్లో ఒకటి వైసీపీకి మూడు టీడీపీకి దక్కుతాయి. సుజనాచౌదరి, నిర్మల సీతారామన్‌ను తిరిగి ఎంపిక చేస్తారని చెబుతున్నారు. మిగిలిన మూడో సీటును యనమలతో భర్తీ చేస్తారని అంటున్నారు. రాజ్యసభకు వెళ్లే ఆలోచనపై మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలుంటాయని వాటిలో కొన్నే నెరవేరుతాయన్నారు. తనను రాజ్యసభకు పంపడంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

Tags:    
Advertisement

Similar News