కన్నుమూసిన కమ్యూనిస్ట్ శిఖరం

సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్‌ (అర్ధేందు భూషన్ బర్ధన్) కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం పక్షవాతానికి గురైన ఆయన  రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. 1996-2012 సంవత్సరాల మధ్య సీపీఐకి జాతీయ కార్యదర్శిగా బర్దన్ పనిచేశారు. ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని బరిసల్ అనే ప్రాంతంలో ఆయన 1924 సెప్టెంబర్ 24న బర్దన్ జన్మించారు. బర్ధన్ భార్య నాగపూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉండే వారు. ఆమె 1986లో మృతి చెందారు. […]

Advertisement
Update: 2016-01-02 11:39 GMT

సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్‌ (అర్ధేందు భూషన్ బర్ధన్) కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం పక్షవాతానికి గురైన ఆయన రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. 1996-2012 సంవత్సరాల మధ్య సీపీఐకి జాతీయ కార్యదర్శిగా బర్దన్ పనిచేశారు. ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని బరిసల్ అనే ప్రాంతంలో ఆయన 1924 సెప్టెంబర్ 24న బర్దన్ జన్మించారు.

బర్ధన్ భార్య నాగపూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉండే వారు. ఆమె 1986లో మృతి చెందారు. వారికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. 1957లో ఆయన మహారాష్ట్ర శాసన సభకు ఇండిపెండెంటు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. చాలా కాలం పాటు ఆయన ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.

Tags:    
Advertisement

Similar News