హరి మళ్లీ స్వీయ సూర్య శిక్ష

తెలిసి తప్పులు చేసినా అది మా జన్మహక్కు అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తుంటారు. కానీ ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్‌ ఈదర హరిబాబు మాత్రం అలా కాదు. ఆయనకు ఆయనే న్యాయమూర్తి. తప్పు చేస్తే సొంతంగా శిక్ష విధించుకుంటారు. మొన్నీ మధ్య ప్రభుత్వ వాహనాన్ని సొంత అవసరాలకు వాడుకున్నందుకు సొంత శిక్ష వేసుకున్నారు. అరగంట పాటు ఎండలో నిలబడి శిక్ష పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి సూర్య శిక్షను వేసుకున్నారు హరిబాబు. ఈసారి తప్పు ఆయన చేయలేదు. జెడ్పీ […]

Advertisement
Update: 2015-12-28 04:04 GMT

తెలిసి తప్పులు చేసినా అది మా జన్మహక్కు అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తుంటారు. కానీ ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్‌ ఈదర హరిబాబు మాత్రం అలా కాదు. ఆయనకు ఆయనే న్యాయమూర్తి. తప్పు చేస్తే సొంతంగా శిక్ష విధించుకుంటారు. మొన్నీ మధ్య ప్రభుత్వ వాహనాన్ని సొంత అవసరాలకు వాడుకున్నందుకు సొంత శిక్ష వేసుకున్నారు. అరగంట పాటు ఎండలో నిలబడి శిక్ష పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి సూర్య శిక్షను వేసుకున్నారు హరిబాబు. ఈసారి తప్పు ఆయన చేయలేదు. జెడ్పీ హైస్కూల్‌ టీచర్లు చేశారు. అయితే నైతిక బాధ్యతగా హరిబాబు శిక్ష విధించుకున్నారు. స్కూల్‌లో మొత్తం 15 మంది టీచర్లు ఉండగా… ఐదుగురు మాత్రమే సమయానికి వచ్చారు. మిగిలిన 10 మంది సోమరి టీచర్లు మాత్రం సమయానికి రాలేదు. దీంతో టీచర్ల గైర్హాజరుకు తాను నైతిక బాధ్యత తీసుకుని 10 నిమిషాల పాటు ఎండలో నిలబడ్డారు హరిబాబు.

Tags:    
Advertisement

Similar News