అగ్రిగోల్డ్ వెనుక సీఎం ఓఎస్‌డీ?

ఏపీ సీఎం చంద్రబాబు ఓఎస్‌డీ సీతేపల్లి అభీష్ట అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఓఎస్డీ రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.  కొద్ది కాలంగా అభీష్ట సచివాలయానికి కూడా రావడం లేదు. లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు కావడం వల్లే అభీష్టను సీఎం ఓఎస్డీగా నియమించారు. ఈయన తీరు తొలి నుంచి వివాదాస్పదంగానే ఉంది. అసలు అభీష్ట నియామకమే నిబంధనలకు విరుద్దమని ఇటీవల ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అరోపించారు. తాజాగా అభీష్ట అగ్రిగోల్డ్ కేసులో వేలు పెట్టారని ఆరోపణ. అగ్రిగోల్డ్ […]

Advertisement
Update: 2015-12-26 03:05 GMT

ఏపీ సీఎం చంద్రబాబు ఓఎస్‌డీ సీతేపల్లి అభీష్ట అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఓఎస్డీ రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. కొద్ది కాలంగా అభీష్ట సచివాలయానికి కూడా రావడం లేదు. లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు కావడం వల్లే అభీష్టను సీఎం ఓఎస్డీగా నియమించారు. ఈయన తీరు తొలి నుంచి వివాదాస్పదంగానే ఉంది. అసలు అభీష్ట నియామకమే నిబంధనలకు విరుద్దమని ఇటీవల ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అరోపించారు. తాజాగా అభీష్ట అగ్రిగోల్డ్ కేసులో వేలు పెట్టారని ఆరోపణ. అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కోర్టు కూడా అగ్రిగోల్డ్‌ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అభీష్టను ప్రభుత్వం దూరంగా పెట్టినట్టు తెలుస్తోంది. ప్రముఖ మీడియా సంస్థ ఈ విషయాన్ని ప్రసారం చేసింది.

అభీష్ట సీనియర్ ఐఏఎస్‌ల పట్ల కూడా అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. తమ పరిధిలోని అంశాల్లో అభీష్ట జోక్యం ఎక్కువైందని మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చాలా కాలంగా ఆగ్రహంతో ఉన్నారు. తనకు అనుకూలమైన మంత్రుల విషయంలో సానుకూలంగానూ.. తనకు నచ్చని మంత్రులకు సంబంధించి వ్యతిరేకంగా నివేదికలు సీఎంకు అందజేస్తుంటారని పార్టీ నేతలు రుసరుసలాడుతుంటారు. అయితే లోకేష్‌ అండ ఉండడంతో ఎవరూ బయటపడలేదు. గతంలో లోకేష్ ఆధ్వర్యంలో నడిచిన ఒక న్యూస్ ఛానల్ బాధ్యతలను అభీష్టయే చూసేవారు. కొన్ని నెలల క్రితం ఒబామాను కలిసేందుకు లోకేష్ అమెరికా వెళ్లిన సమయంలోనూ అభీష్ట ఆయన వెంటే ఉన్నారు. అభీష్ట రాజీనామా చేసే యోచనలో ఉన్నా లోకేష్‌ స్పందన బట్టే ఆయన తుది నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News