రామోజీకి అద్భుత యాగఫలం

రామోజీ ఫిల్మ్‌ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తా. ఇదీ తెలంగాణ ఉద్యమసమయంలో కేసీఆర్‌ చేసిన భీకరగర్జన. లక్ష నాగళ్ల సంగతేమో గానీ కేసీఆర్‌ కూడా ఈనాడు రామోజీ బుట్టలో పడిపోయినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే ఫిల్మ్‌సిటీ కోసం మూడు వేల ఎకరాలకు పైగా సొంతం చేసుకున్న రామోజీకి మరో 505 ఎకరాలు సమర్పించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా అధికారులు సిద్ధం చేశారు. 505 ఎకరాల  కేటాయింపుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా అధికారుల నుంచి […]

Advertisement
Update: 2015-12-25 00:12 GMT

రామోజీ ఫిల్మ్‌ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తా. ఇదీ తెలంగాణ ఉద్యమసమయంలో కేసీఆర్‌ చేసిన భీకరగర్జన. లక్ష నాగళ్ల సంగతేమో గానీ కేసీఆర్‌ కూడా ఈనాడు రామోజీ బుట్టలో పడిపోయినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే ఫిల్మ్‌సిటీ కోసం మూడు వేల ఎకరాలకు పైగా సొంతం చేసుకున్న రామోజీకి మరో 505 ఎకరాలు సమర్పించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా అధికారులు సిద్ధం చేశారు. 505 ఎకరాల కేటాయింపుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా అధికారుల నుంచి రెవెన్యూ శాఖకు ప్రతిపాదన ఫైల్ వెళ్లింది. సదరు ఫైల్‌ శరవేగంగా ముందుకు సాగుతోంది.

ఈ 505 ఎకరాలను ఓం సిటీ పేరున కేటాయించనున్నారు. హయత్‌నగర్ మండలంలోని అబ్ధుల్లాపూర్, కొహెడ, సుర్మాయ్‌గూడ సమీపంలో ఈ భూమి ఉంది. అయితే ఈ భూమి ధర ఎంతన్నది ఇంకా నిర్ణయించలేదని రంగారెడ్డి జిల్లా అధికారులు చెబుతున్నారు. ఆఖరి దశలో ధర నిర్ణయిస్తారట. ఓంసిటీ దాదాపు 2000 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఇందు కోసం రూ. 3000 కోట్ల వెచ్చించనున్నారు. దేశంలోని ప్రసిద్ద 108 ఆలయాలను ఓంసిటీలో నిర్మిస్తారని తెలుస్తోంది. ఆలయాలతో పాటు భారీ హోటల్, ఫంక్షన్ హాల్, పార్క్‌ నిర్మించనున్నారు. ఏప్రిల్‌లో రామోజీని కేసీఆర్‌ కలిశారు. ఆ సమయంలోనే ఓంసిటీ గురించి వివరించినట్టు తెలుస్తోంది. అప్పుడే భూమి కేటాయింపుకు కేసీఆర్‌ తలూపారని సమాచారం. కొద్దికాలంగా కేసీఆర్‌, రామోజీ మధ్య బంధం చాలా బలపడిందని చెబుతుంటారు. కేసీఆర్ చండియాగానికి కూడా రామోజీ స్వయంగా వెళ్లారు.

Tags:    
Advertisement

Similar News