16 దాటితే పెద్దోళ్లే

ఎట్టకేలకు రాజ్యసభలో జువైనల్ జస్టిస్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్న వారిలో మైనర్లు కూడా ఉంటున్నారు. అయితే వారిని శిక్షించేందుకు వయసు అడ్డంకిగా ఉండడంతో చట్టసవరణకు కేంద్రం ప్రతిపాదించింది. హైడ్రామా మధ్య ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ బాల నేరస్తుల చట్టసవరణకు మద్దతు పలికింది. ఈ సవరణల ప్రకారం అత్యాచారం, హత్యలాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినవారిలో 16 ఏళ్లు దాటినవారు ఉంటే వారిని బాల నేరస్తులుగా పరిగణించే అవకాశం ఉండదు. వారికి […]

Advertisement
Update: 2015-12-22 23:30 GMT
ఎట్టకేలకు రాజ్యసభలో జువైనల్ జస్టిస్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్న వారిలో మైనర్లు కూడా ఉంటున్నారు. అయితే వారిని శిక్షించేందుకు వయసు అడ్డంకిగా ఉండడంతో చట్టసవరణకు కేంద్రం ప్రతిపాదించింది. హైడ్రామా మధ్య ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ బాల నేరస్తుల చట్టసవరణకు మద్దతు పలికింది. ఈ సవరణల ప్రకారం అత్యాచారం, హత్యలాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినవారిలో 16 ఏళ్లు దాటినవారు ఉంటే వారిని బాల నేరస్తులుగా పరిగణించే అవకాశం ఉండదు. వారికి కూడా అందరికీ వర్తించే సాధారణ చట్టాల ప్రకారమే శిక్షలు అమలు చేస్తారు. బాలనేరస్తుల చట్టసవరణ ద్వారా 16ఏళ్లు దాటిన వారికి మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది.
ఇప్పటి వరకు 18 ఏళ్లలోపు వారిని జువైనల్ జస్టిస్ బోర్డ్స్‌ విచారిస్తున్నాయి. నేరం ఎంత తీవ్రమైనదైనా వారు మైనర్లు కావడంతో గరిష్టంగా మూడేళ్లు మాత్రమే శిక్షలు పడుతున్నాయి. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ అత్యాచార ఘటనలో మైనర్ పాత్ర కూడా ఉంది. ఇప్పటికే మూడేళ్ల శిక్ష అనుభవించిన ఆ మైనర్ విడుదలకావడంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బాలనేరస్తుల చట్టసవరణ బిల్లు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందింది. దీంతో రాజ్యసభలోనూ పెద్ద ఇబ్బందులు లేకుండానే ఆమోదం తెలిపారు. అయితే చివరి నిమిషంలో కొంత హైడ్రామా నడిచింది.
రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నపుడే బాలనేరస్తులను శిక్షించే వయసును 16 ఏళ్లకు తగ్గించారని.. అయితే 2000 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ దాన్ని మళ్లీ 18 ఏళ్లకు పెంచిందని కాంగ్రెస్ గుర్తుచేసింది. మరోవైపు ఈ బిల్లు సవరణకు తృణమూల్‌ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, జేడీయు, బీజేడీ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఇక బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయగానే చట్టరూపం దాలుస్తుంది. ఈ బిల్లు సవరణలపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేసినా తన కుమార్తెకు మాత్రం న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Tags:    
Advertisement

Similar News